Share News

Supreme Court: మెడికల్‌ కోర్సుల మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించండి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:18 AM

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నీట్‌ అయిదో విడిత కౌన్సెలింగ్‌ తరువాత కూడా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సీట్లు మిగిలితే వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది.

Supreme Court: మెడికల్‌ కోర్సుల మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించండి

విలువైన సీట్లు వృథా కాకూడదు.. ఎంసీసీకి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 22: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నీట్‌ అయిదో విడిత కౌన్సెలింగ్‌ తరువాత కూడా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సీట్లు మిగిలితే వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 30న అయిదో విడత కౌన్సెలింగ్‌ ముగియనుండడం గమనార్హం. ఈ ఒక్కసారికి ప్రత్యేక సందర్భంగా పరిగణించి ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కి ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన సీట్లకు కూడా విడి/ప్రత్యేక (స్ట్రే/స్పెషల్‌) కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై జరిపిన ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. కేవలం వెయింటింగ్‌ లిస్టులో ఉన్న అభ్యర్థులనే కౌన్సెలింగ్‌ చేసి సీట్లు కేటాయించాలని పేర్కొంది.

Updated Date - Dec 23 , 2024 | 03:18 AM