Swati Maliwal: రాజ్యసభ ఎంపీగా రెండుసార్లు ప్రమాణం చేసిన స్వాతి మలివాల్.. ఎందుకంటే
ABN , Publish Date - Jan 31 , 2024 | 04:29 PM
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభలో బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆమె ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఒకసారి కాకుండా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ (Swati Maliwal) పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభ (Rajya Sabha)లో బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆమె ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఒకసారి కాకుండా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది.
తొలుత ప్రమాణస్వీకారం అనంతరం చివర్లో 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ స్వాతి మలివాల్ ముగించారు. దీనిపై బీజేపీ నేత పీయూష్ గోయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె చేసిన ప్రమాణస్వీకారాన్ని రద్దుచేశారు. అనంతరం సభావిధానాలకు అనుగుణంగా స్వాతి మలివాల్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా స్వాతి మలివాల్‌ను ఆ పార్టీ నిలబెట్టగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.