ఢిల్లీలో టీడీపీ సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:23 AM
తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
త్వరలో నోయిడా, గురుగ్రామ్‌లోనూ కార్యక్రమాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆదివారం మసోనిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ మద్దతుదారులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించడం వల్ల పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో నోయిడా, గురుగావ్‌లోనూ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి ఎన్.సత్యనారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.