Share News

‘దుబాయి అమ్నెస్టీ’పై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:41 AM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరేందుకు తెలుగు రాష్ట్రాల...

‘దుబాయి అమ్నెస్టీ’పై దృష్టి పెట్టాలి

  • పథకం సద్వినియోగానికి చొరవ చూపాలి

  • ప్రభుత్వాలకు ఐపీఎఫ్‌ తెలుగు చాప్టర్‌ సూచన

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని దుబాయిలోని ప్రవాసీ భారతీయ సంఘం ఐపీఎఫ్‌ తెలుగు చాప్టర్‌ సూచించింది. ఈ మేరకు సంఘం ఆదివారం సమావేశమై ఈ పథకం కింద స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రవాసీయుల కష్టసుఖాలను తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక అధికారుల బృందాలను దుబాయికి పంపించాలని కోరింది.

భారతీయ దౌత్య కార్యాలయాలు జారీ చేసే ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, గడువు ముగిసిన పాస్‌పోర్టులను పునరుద్ధరించడానికి హైదరాబాద్‌, విజయవాడల్లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా విచారణలో జాప్యం జరగకుండా చూడాలని సంఘం అధ్యక్షుడు కుంబాల మహేందర్‌ రెడ్డి కోరారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాస్‌పోర్టుల విచారణలో విదేశాల్లోని భారతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల మధ్య సమన్వయం లేక ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, సాధారణ పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతోందని దీన్ని తగ్గించాలని ఆయన కోరారు. స్వదేశాలకు తిరిగి వెళ్తున్న వారిలో నైపుణ్యం ఆధారంగా అమరావతి, ఫ్యూచర్‌ సిటీల నిర్మాణంలో వారికి ఉపాధి కల్పించాలని మహేందర్‌ రెడ్డి కోరారు.

Updated Date - Sep 10 , 2024 | 03:41 AM