Share News

అలకనంద నదిలోకి దూసుకెళ్లిన టెంపో

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:59 AM

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌-బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై యాత్రికులతో వెళ్తున్న టెంపో శనివారం ఉదయం అదుపుతప్పి దాదాపు 250 మీటర్ల లోతులో అలకనంద నదిలో పడింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది మరణించగా,

అలకనంద నదిలోకి దూసుకెళ్లిన టెంపో

14 మంది యాత్రికుల మృతి

రుద్రప్రయాగ్‌, జూన్‌ 15: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌-బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై యాత్రికులతో వెళ్తున్న టెంపో శనివారం ఉదయం అదుపుతప్పి దాదాపు 250 మీటర్ల లోతులో అలకనంద నదిలో పడింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారు. టెంపోలో మొత్తం 26 మంది ఉన్నారని, వారిలో అత్యధికులు ఢిల్లీకి చెందిన వారేనని, పర్యాటక ప్రాంతమైన చోప్తాకు వెళ్తుండగా రైటోలి వద్ద ప్రమాదం జరిగిందని రుద్రప్రయాగ్‌ ఎస్పీ అశోక్‌ భదానే తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఆదేశాలతో హెలికాప్టర్‌ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలిం చినట్లు చెప్పారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Jun 16 , 2024 | 04:59 AM