Share News

PM Modi : ‘ఎమర్జెన్సీ’ మైండ్‌సెట్‌ ఇంకా పోలేదు

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:06 AM

దేశంలో ఎమర్జెన్సీ విధించినవారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని ప్రకటించే హక్కు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రె్‌సకు ఇప్పటికీ ఆ మైండ్‌సెట్‌ పోలేదని ధ్వజమెత్తారు. 1975లో జూన్‌ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారని.. రాజ్యాంగాన్ని అణచివేశారని.. ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా

PM Modi  : ‘ఎమర్జెన్సీ’ మైండ్‌సెట్‌ ఇంకా పోలేదు

ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు

356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారు

రాజ్యాంగాన్ని అణచివేశారు.. స్వేచ్ఛ హరించారు

అలాంటివారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా?

కాంగ్రె్‌స పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం

వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే గతం తవ్వుతున్నారు

మాట్లాడేదానికిభిన్నంగా వ్యవహరిస్తుంటారు

ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోలేదు

తిప్పికొట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

వెంకయ్య ఇంటికి మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 25: దేశంలో ఎమర్జెన్సీ విధించినవారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని ప్రకటించే హక్కు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రె్‌సకు ఇప్పటికీ ఆ మైండ్‌సెట్‌ పోలేదని ధ్వజమెత్తారు. 1975లో జూన్‌ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారని.. రాజ్యాంగాన్ని అణచివేశారని.. ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా చేశారని గుర్తుచేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేసే 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారని.. పత్రికాస్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని.. సమాఖ్య విధానాన్ని నాశనం చేశారని.. రాజ్యాంగాన్ని ప్రతి దశలో ఉల్లంఘించారని దుయ్యబట్టారు. రాజ్యాంగంపై అమితప్రేమ ఉందని పైకి చెబుతూ.. దానిపై ఉన్న ఏహ్య భావాన్ని నిజానికి దాచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వారి అసంగత చర్యలను గ్రహించే పదే పదే ఓడిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రజాస్వామిక సూత్రాలన్నీ తుంగలో తొక్కారని, కాంగ్రె్‌సను వ్యతిరేకించే ప్రతి వ్యక్తినీ చిత్రహింసల పాల్జేశారని విమర్శించారు. నాడు ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినవారికి ఇది నివాళులు అర్పించాల్సిన రోజుగా పేర్కొన్నారు. ఓ కుటుంబాన్ని అధికారంలో ఉంచడం కోసం కాంగ్రెస్‌ చాలా సార్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌లో ప్రజాస్వామ్యానికి తావే ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక విషయంలో విపక్షాలు కపటంతో, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

వైఫల్యాలను దాచేందుకే

ప్రధాని మోదీ తన వైపల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గతాన్ని తవ్వితీస్తుంటారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. నిజానికి గత పదేళ్లుగా ఆయన అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేస్తున్నారని ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఆయన తరచూ ఏకాభిప్రాయం, సహకారం గురించి మాట్లాడతారని... తద్విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. ‘పార్టీలను చీల్చడం.. ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదోవన పడగొట్టడం, 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పడం.. సీఎంలను జైల్లో పెట్టడం.. ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం.. ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసినప్పుడు.. మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలను తెచ్చినప్పుడు.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు.. నోట్ల రద్దు, లాక్‌డౌన్‌, ఎలక్టొరల్‌ బాండ్ల చట్టం తెచ్చినప్పుడు మీరు చెప్తున్న ఏకాభిప్రాయం ఎక్కడుంది’ అని ఖర్గే ప్రధానిపై ధ్వజమెత్తారు.

Updated Date - Jun 26 , 2024 | 06:06 AM