Share News

Parliament Sessions: పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం రేపే.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:42 PM

కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Parliament Sessions: పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం రేపే.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు

ఢిల్లీ: కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్.. ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.


మోదీ తరువాత మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, సహాయ మంత్రులు, తరువాత మిగతా ఎంపీలు రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ప్రమాణం చేయనున్నారు. మొదట అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. మిగతా 264 మంది లోక్‌సభ ఎంపీలు రెండో రోజు ప్రమాణం చేస్తారు. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు నిమిషం పడుతుంది.


తెలుగు రాష్ట్రాల ఎంపీలు..

అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీల ప్రమాణం అనంతరం జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Jun 23 , 2024 | 06:42 PM