ISRO: ఇస్రో మరో ఘనత.. ‘పుష్పక్’ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:57 PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. ఇస్రో తయారు చేసిన ‘రీయూజబుల్ లాంచ్ వెహికల్’ ప్రయోగం నేడు మంచి సక్సెస్ సాధించింది. నేటి (శుక్రవారం) ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఈ రాకెట్ సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. ఇస్రో తయారు చేసిన ‘రీయూజబుల్ లాంచ్ వెహికల్ (Reusable Launch Vehicle)’ ప్రయోగం నేడు మంచి సక్సెస్ సాధించింది. నేటి (శుక్రవారం) ఉదయం కర్ణాటక (Karnataka)లోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (Aeronautical Test Range) నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఈ రాకెట్ సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. ఆర్ఎల్వీ ప్రయోగం (RLV Test) ద్వారా అంతరిక్ష యాత్రల ఖర్చు తగ్గడంతో పాటు లాంచింగ్ రాకెట్‌లను తిరిగి వాడుకునేందుకు గానూ ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అలాగే దేశీయ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసేందుకు ఆర్ఎల్వీ ఉపయోగపడనుంది. పునర్వినియోగ ప్రయోగ రాకెట్‌ల తయారీ భారత్ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది.
Anna Hazare: కేజ్రీవాల్‌పై అరెస్టుపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
రెక్కలతో తయారు చేసిన ఈ రాకెట్‌కు పుష్పక్ (Pushpak) అని ఇస్రో నామకరణం చేసింది. ఐఏఎఫ్ (IAF)కు చెందిన చినూక్ హెలికాప్టర్ (Chinook Helicapter)లో తొలుత ఆర్‌ఎల్‌వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలిపెట్టారు. అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నింటినీ అధిగమించి మరీ నిర్దేశిత మార్గంలో చక్కగా ఆర్ఎల్‌వీ ల్యాండ్ అయ్యింది. రన్‌వేపై చక్కగా ల్యాండ్ అయిన మీదట.. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో స్వయంగా ఆగిపోయింది. ఈ మిషన్‌ను చేపట్టడంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (Vikram Sarabhai Space Centre)కు ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ సహకరించాయి. అలాగే ఐఏఎఫ్, ఏడీఈ, ఏడీఆర్‌డీఈ, సీఈఎంఐఎల్‌ఏసీ తమ వంతు సహకారాన్ని అందించాయి. ప్రయోగం సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. గత ఏడాది ఇస్రో ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్-01ను పూర్తి చేసింది. ఎల్‌ఈఎక్స్-01లో ఉపయోగించిన బాడీ, ఫ్లైట్ సిస్టమ్స్‌నే తాజా ప్రయోగంలోనూ ఇస్రో శాస్త్రవేత్తలు వాడారు.
Tamilisai: బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై సౌందరరాజన్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి