Share News

Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:52 AM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గణనాధునికి నైవేద్యంగా పలు రకాలు స్వీట్లు, పిండి పంటలు నిర్వాహాకులు సమర్పిస్తున్నారు. వినాయకుడిని అత్యంత ప్రీతిపాత్రమైన జాబితాలో కుడుము

Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గణనాధునికి నైవేద్యంగా పలు రకాలు స్వీట్లు, పిండి పంటలు నిర్వాహాకులు సమర్పిస్తున్నారు. వినాయకుడిని అత్యంత ప్రీతిపాత్రమైన జాబితాలో కుడుములు, ఉండ్రాళ్లే కాదు.. లడ్డూలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలో ఓ స్వీట్ షాపు యాజమాన్యం.. 500 కేజీల లడ్డూను తయారు చేసింది. ఆ లడ్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


ఇది వైరల్ అవుతుంది. డ్రై ప్రూట్‌తోపాటు స్వచ్ఛమైన నేతితో ఈ భారీ లడ్డును తయారు చేసినట్లు ఆ స్వీట్ షాపు యజమాన్యం వివరించారు. ఈ షాపు యాజమాని ప్రియాంక మాలిక్ మాట్లాడుతూ.. భాద్రపద శుద్ద చతుర్థి అంటే వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఆ రోజు అత్యంత శుభమైన కాలమని ప్రియాంక తెలిపారు.

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు


ఆ క్రమంలో ప్రతీ ఏడాది వినాయకుడి చవితి రోజు లడ్డును కొత్తగా తయారు చేసేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. దాదాపు 140 ఏళ్ల నాటి నుంచి తమ పూర్వీకులు ఈ షాపును నడుపుతున్నారు. నాటి నుంచి వినాయక చవితి రోజు భారీ లడ్డు తయారు చేయడం ఓ ఆచారంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ లడ్డుపైన చిన్న లడ్డూను ఏర్పాటు చేశారు.


దానిపై చిన్న వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక గుజరాత్‌లో అయితే వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డూలను తయారు చేస్తారు. ఈ లడ్డూలను తినేందుకు పోటీలను సైతం ఏర్పాటు చేస్తారు.


మరోవైపు మహారాష్ట్రలోని మధ్య ముంబయిలోని లాల్‌బాగ్చ రాజా సర్వజనిక్ గణేశ్ ఉత్సవ్ మండల్ వినాయకచవితి సందర్బంగా గణనాథుడుని ఏర్పాటు చేసింది. ఈ గణపతికి వినాయక చవితి రోజు.. ఏకంగా రూ. 50 లక్షల నగదు విరాళాలుగా భక్తులు సమర్పించారు.


ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు సైతం ముంబయి తరలి వస్తారు. ప్రతీ రోజు ఈ గణపతిని 1.5 మిలియన్ల మంది స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వినాయకుడి విగ్రహాలను భారీగా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 16వ తేదీతో గణపతి నవరాత్రులు ముగియనున్నాయి.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 10 , 2024 | 11:52 AM