Tamilnadu: తమిళనాడులోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తీరా తనిఖీలు నిర్వహించాక..
ABN , Publish Date - Mar 04 , 2024 | 07:22 PM
తమిళనాడులోని (Tamilnadu) రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాలల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్‌లోని (Coimbatore) పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్ (PSBB Millennium School), కాంచీపురం జిల్లాలోని (Kancheepuram District) ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళనాడులోని (Tamilnadu) రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాలల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్‌లోని (Coimbatore) పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్ (PSBB Millennium School), కాంచీపురం జిల్లాలోని (Kancheepuram District) ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. తొలుత ఆదివారం రాత్రి కోయంబత్తూరులోని ప్రైవేట్ పాఠశాలకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. అనంతరం సోమవారం ఉదయం మరో ప్రైవేట్ స్కూల్‌కి ఫోన్ కాల్ వచ్చింది. ఈ బెదిరింపులు రాగానే అప్రమత్తమైన ఆ రెండు పాఠశాలల యాజమాన్యాలు.. వెంటనే పోలీసులను ఆశ్రయించాయి.
తమకు సమాచారం అందిన వెంటనే పోలీసులు (Police), బాంబు స్క్వాడ్ (Bomb Squad) బృందాలు రంగంలోకి దిగారు. రెండు పాఠశాలల్లోనూ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే.. ఆ రెండు స్కూల్స్ ఆవరణలో పేలుడు పదార్థాలేవీ అధికారులకు లభించలేదు. ఈ నేపథ్యంలోనే.. ఈ రెండూ బూటకపు బెదిరింపులేనని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. ఈ పనికి ఎవరు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ-మెయిల్, ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ప్రస్తుతం పాఠశాలల్లో 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో పోలీసులు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. సరైన భద్రతా తనిఖీలు లేకుండా పాఠశాల ఆవరణలోకి ఎవరినీ అనుమతించబోమని తెలిపారు.
ఇదిలావుండగా.. ఇలాంటి బూటకపు బెదిరింపులు (Hoax Threats) రావడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరి 8వ తేదీన చెన్నైలోని (Chennai) పలు పాఠశాలలకు ఫిబ్రవరి 8న ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే.. బాంబు బాంబు డిటెక్షన్, డిస్పోజల్ టీమ్‌లు సోదాలు నిర్వహించాక.. ఇవి బూటకపు బెదిరింపులని నిర్ధారించాయి. గతేడాది డిసెంబర్‌లోనూ బెంగళూరులోని (Bengaluru) దాదాపు 15 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులొచ్చాయి. ఈ ఈమెయిల్‌ను పంపేందుకు ఉపయోగించిన ప్రోగ్రామ్ కోడ్‌ను పోలీసులు విజయవంతంగా గుర్తించగలిగారు కానీ.. బాధ్యులను మాత్రం గుర్తించలేకపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి