Share News

యుద్ధానికి రెండేళ్లు.. రష్యాపై ఆంక్షల కొరడా

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:35 AM

రష్యాపై అగ్ర రాజ్యం అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షల కొరడా ఝళిపించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యం, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతి నేపథ్యంలో

యుద్ధానికి రెండేళ్లు.. రష్యాపై ఆంక్షల కొరడా

మాస్కో, ఫిబ్రవరి 24: రష్యాపై అగ్ర రాజ్యం అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షల కొరడా ఝళిపించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యం, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతి నేపథ్యంలో రష్యాకు చెందిన 500 మంది పైగా వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆర్థికం, ఇంధనం రంగాలకు చెందిన ఈ సంస్థల్లో రష్యా రెండో అతిపెద్ద బ్యాంకు కూడా ఉంది. రష్యన్‌ వ్యాపారుల మీద అమెరికా న్యాయ శాఖ ఐదు కేసులు నమోదు చేయగా, యుద్ధానికి అవసరమైన టెక్నాలజీని సరఫరా చేసిన కంపెనీలపై ఈయూ చర్యలు తీసుకుంది. వీటిలో భారత్‌, శ్రీలంక, తుర్కియేలకు చెందిన సంస్థలు ఉండడం గమనార్హం. నావల్నీ భార్య, కుమార్తెతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సమావేశమయ్యారు. నావల్నీ అరెస్టుకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఇటలీ, కెనడా, బెల్జియం ప్రధానమంత్రులు, యూఈ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఉర్సులా వాన్‌డెర్‌ శనివారం కీవ్‌లో పర్యటించారు.

Updated Date - Feb 25 , 2024 | 08:21 AM