Upendra Dwivedi : భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:05 AM
భారత ఆర్మీకి కొత్త చీఫ్ రానున్నారు. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని
న్యూఢిల్లీ, జూన్ 11: భారత ఆర్మీకి కొత్త చీఫ్ రానున్నారు. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటన చేసింది. ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. వాస్తవానికి మనోజ్ పాండే మే 31వ తేదీనే రిటైర్ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని నెల రోజులపాటు పొడిగించింది. దీంతో ఉపేంద్ర ద్వివేదికి సైన్యాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చే యోచన లేనందునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరిగింది. కానీ, ఆయనకే అవకాశం కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.