భారత టెకీలపై యూఎస్ వీసా భారం
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:19 AM
అమెరికా వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది.
కోర్టు తీర్పు నేపథ్యంలో భారీగా పెంపు
హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ 5 వీసా ఫీజుల్లో
70% నుంచి 201ు వరకూ పెరుగుదల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమెరికా వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది. కొలరాడో జిల్లా కోర్టు జడ్జి షార్లెట్ ఎన్ స్వీనీ మార్చి 29న ఓ కేసులో తీర్పు చెపుతూ ‘కొత్త ఫీజుల అమలును అడ్డుకోవద్దు’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తీర్పు అనంతరం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ ప్రాసె్‌స(యూ్‌ససీఐఎస్) వివిధ రకాల వీసాల ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఉద్యోగులకు కంపెనీలు స్పాన్సర్ చేసే హెచ్ 1బీ వీసా ఫీజు గతంలో 460 యూఎస్ డాలర్లు (రూ.38 వేలు) ఉండేది. ఇప్పుడు అది 780 యూఎస్ డాలర్లకు (రూ.64,000) పెరిగింది. అలాగే దరఖాస్తు ఫీజు 10 యూఎ్‌సడీ(రూ.829) నుంచి ఏకంగా 215(రూ.17,000) యూఎ్‌సడీలకు పెరిగింది. ఇది టెక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతుంది. అలాగే ఉద్యోగులను ఇతర దేశాల నుంచి యూఎ్‌సకు బదిలీ చేయడానికి ఉపయోగించే ఎల్ 1 వీసా చార్జీల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. దీని ఫీజు 460 యూఎ్‌సడీ(రూ.38,000) లనుంచి 1,385 యూఎ్‌సడీ (రూ.1,10,000)లకు పెరిగింది. అలాగే ఇన్వెస్టర్ వీసా ఈబీ 5 ఫీజులో పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. గతంలో ఇది 3,675 యూఎ్‌సడీ (రూ.3 లక్షలు) ఉంటే అది ఇప్పుడు 11,160 యూఎ్‌సడీ(రూ.9 లక్షలు)లకు పెరిగింది. యూఎ్‌స లో నివాసం ఉండాలనుకునే సంపన్న భారతీయులను ఇది ప్రభావితం చేస్తుంది.