Uttarakhand: బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?
ABN , Publish Date - Oct 12 , 2024 | 05:41 PM
ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అంజేంద్ర అజయ్ తెలిపారు.
ఛమోలి: శీతాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయం (Badrinath Temple) ప్రవేశ ద్వారాలను నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూతవేయనున్నట్టు ఆలయ కమిటీ శనివారంనాడు తెలిపింది. ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అంజేంద్ర అజయ్ తెలిపారు.
MEA: బంగ్లాలో హిందూ ఆలయాలపై దాడులు.. ఎంఈఏ తీవ్ర ఆక్షేపణ
ఈ ఏడాది 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను సందర్శించగా, కేథార్‌నాథ్‌ను 13.5 లక్షల భక్తులు సందర్శించారు. కేదార్‌నాథ్, యమునోత్రిలను నవంబర్ 3వ తేదీన, గంగోత్రిని నవంబర్ 3న మూసివేస్తున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. ఇదే విధంగా, రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు అక్టోబర్ 17న మూతపడతాయి. నవంబర్ 4న తుంగనాథ్, నవంబర్ 20న మధ్యమహేశ్వర్ మూతపడనున్నాయి.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..