Navy: భారత నేవీ చీఫ్‌గా దినేష్ త్రిపాఠి.. నేపథ్యం ఇదే
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:51 PM
భారత నౌకాదళ(Indian Navy) తదుపరి చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని(Dinesh Tripathi) నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్‌గా పనిచేస్తున్న త్రిపాఠి, వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఢిల్లీ: భారత నౌకాదళ(Indian Navy) తదుపరి చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని(Dinesh Tripathi) నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్‌గా పనిచేస్తున్న త్రిపాఠి, వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి భారత నావికాదళంలో 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. గతంలో కీలకమైన అసైన్‌మెంట్‌లలో పనిచేశారు.
AAP: కేజ్రీవాల్‌పై కుట్ర, జైలులో ఏదైనా జరగొచ్చు.. ఆప్ ఎంపీ సంచలన ఆరోపణ
ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వెస్ట్రన్ నేవల్ కమాండ్, కేరళలోని ఎజిమల వద్ద ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీకి కమాండెంట్ వంటి కీలక పదవుల్లో ఆయన అనుభవం కలిగి ఉన్నారు. INS వినాష్, కిర్చ్, త్రిశూల్‌తో సహా అనేక నావికాదళ నౌకలకు నాయకత్వం వహించారు.
విద్యా నేపథ్యం..
దినేష్ త్రిపాఠి మధ్యప్రదేశ్‌లోని సైనిక్ స్కూల్ రేవా, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యనభ్యసించారు. 1985లో భారత నౌకాదళంలోకి ప్రవేశించారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పొందారు. US నావల్ వార్ కాలేజీలోని నావల్ కమాండ్ కాలేజీలో ప్రతిష్టాత్మక కోర్సులు తీసుకున్నారు.