Amit Shah: కుల ఆధారిత రిజర్వేషన్లపై కీలక కామెంట్స్ చేసిన అమిత్ షా..
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:12 PM
కుల ఆధారిత రిజర్వేషన్లపై(Cast Reservations) కేంద్ర మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) కీలక కామెంట్స్ చేశారు. కుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని బీజేపీ(Bjp) ఎప్పటికీ మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు.. మరెవరినీ తాకనివ్వదని కూడా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కుల ఆధారిత రిజర్వేషన్లపై(Cast Reservations) కేంద్ర మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) కీలక కామెంట్స్ చేశారు. కుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని బీజేపీ(Bjp) ఎప్పటికీ మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు.. మరెవరినీ తాకనివ్వదని కూడా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజ్యాంగాన్ని మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.
రాజ్యాంగం విషయంలో బీజేపీపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజీపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తుందన్నారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ ఎక్కువ సీట్లను గెలుస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాదిన ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. దక్షిణాదిలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని.. తద్వారా ఈ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుంటామని అమిత్ షా చెప్పారు.
తొలిదశ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలివే..
తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. , అండమాన్ మరియు నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1) మరియు లక్షద్వీప్ (1). అసోం, మహారాష్ట్రలో ఐదు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీట్లు రానున్నాయి. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ (60 అసెంబ్లీ సీట్లు), సిక్కిం (32 అసెంబ్లీ సీట్లు) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..