Share News

New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:05 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు విదేశీ పర్యాటకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సదరు పర్యాటకులు ఆటోలో ప్రయాణిస్తున్నారు.

New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు విదేశీ పర్యాటకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సదరు పర్యాటకులు గురువారం ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆ ఆటోను ఇద్దరు బాలికలు వెంబడిస్తూ.. వారిని నగదు యాచిస్తున్నారు. ఆ క్రమంలో ఓ బాలిక ఆటో వెనుకనున్న రాడ్ పట్టుకొని విదేశీ ప్రయాణికుడిని డబ్బులివ్వాలంటూ దీనంగా కోరుతుంది. డబ్బులు లేవంటూ అతడు సమాధానం ఇచ్చాడు.


మరో బాలిక అయితే వేగంగా వేళ్తున్న ఆటోను అంతే వేగంగా అనుసరిస్తూ.. పరిగెడుతోంది. ఇలా పరిగెత్తడం సురక్షితం కాదంటూ ఆటోని మరో పర్యాటకుడు పేర్కొన్నాడు. ఇంకో ప్రయాణికుడు అయితే.. ప్రస్తుతం ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ తతంగం మొత్తాన్ని ఆ విదేశీ పర్యాటకుడు తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’


భారత్‌లో పర్యాటనకు వచ్చే విదేశీ పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విదేశీ పర్యాటకులను నగదు కోసం ఓ బాలిక యాచిస్తుంది. మరో బాలిక.. ఆటో వెనుక వేగంగా పరిగెత్తుతుంది. ఈ ఇద్దరి బాలికల వ్యవహార శైలిపై ఇద్దరు విదేశీ పర్యాటకులు సైతం స్పందించారు. కానీ ఆటో డ్రైవర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ధోరణితో తాను డ్రైవ్ చేసుకుంటూ ముందు వెళ్లిపోయాడు. దేశ రాజధానిలో ఈ తరహా ఘటనలు సర్వసాధారణమనే అభిప్రాయంలో సదరు ఆటో రిక్షా డ్రైవర్ ఉన్నట్లుగా ఉందనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.

Also Read: Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!


ఇంకోవైపు ఈ తరహా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతేడాది ఓ విదేశీ పర్యాటకుడు న్యూఢిల్లీ నగర వీధుల్లో వెళ్తుంటే.. అతడిని నగదు ఇవ్వాలంటూ ఓ బాలిక వెంట పడి యాచించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో దాదాపు 70 వేల మంది వీధి బాలలు ఉన్నారు. వారిలో సగం మందికిపైగా బాలలు యాచక వృత్తిలోనే కొనసాగుతున్నారని గణాంకాలు ఘోషిస్తున్నాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 05:32 PM