Vijaya Rahatkar: జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా విజయా రహాట్కర్
ABN , Publish Date - Oct 19 , 2024 | 05:12 PM
ఎన్‌సీడబ్ల్యూ 9వ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తు్న్న విజయా రహాట్కర్ దీనికి ముందు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమన్ చైర్‌పర్సన్‌గా 2016-2021 వరకూ సేవలందించారు.
న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ (NCW) కొత్త చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహాట్కార్ (Vijaya Kishore Rahatkar)ను కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు నియమించింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్ యాక్ట్- 1990లోని సెక్షన్ 3 కింద ఈ నియామకం జరిపినట్టు ఒక నోటిఫికేషన్‌లో కేంద్రం తెలిపింది. ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా మూడేళ్లు పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. రహట్కార్‌తో పాటు ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్‌ను కూడా కేంద్రం నియమించింది. మజుందార్ నియామకం కూడా మూడేళ్ల పాటు కొనసాగుతుంది.
Maharashtra: 'మహాయుతి' కూటమి సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదే.. సీఎం ఆయనే
ఎవరీ విజయా రహాట్కర్ ?
ఎన్‌సీడబ్ల్యూ 9వ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తు్న్న విజయా రహాట్కర్ దీనికి ముందు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమన్ చైర్‌పర్సన్‌గా 2016-2021 వరకూ సేవలందించారు. పోక్సో, యాంటీ ట్రిపుల్ తలాక్ చర్యలు, యాంటీ ఉమన్ ట్రాఫికింగ్ యూనిట్ల వంటి అంశాలపై చట్టపరమైన సంస్కరణలపై కీలకంగా దృష్టి సారించారు. డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను ప్రమోట్ చేశారు. వీటికి తోడు నాయకత్వ ప్రతిభను కూడా ఆయన చాటుకున్నారు. నేషనల్ యూత్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షురాలిగా, మహిళ విభాగం అధ్యక్షురాలిగా ఏడళ్లు పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. 2007 నుంచి 2010 వరకూ ఛత్రపతి సంభాజీనగర్ మేయర్‌గా సేవలందించారు. హెల్త్‌కేర్, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్‌గా సిటీని అభివృద్ధి చేసేందుకు, టూరిజం పోత్సాహానికి కృషి చేశారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ లోకల్ సెల్ఫ్-గవర్నమెంట్ అడ్వయిజరీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మహిళా సాధికారతకు చేసిన కృషికి పలు అవార్డులు అందుకున్నారు. నేషనల్ లా అవార్డు, సావిత్రభాయి ఫులే అవార్డులు ఆమెను వరించాయి. మహిళా లీగల్ అంశాలపై 'విధిలిఖిత్' అనే పుస్తకంతో సహా పలు పలు పుస్తకాలను రచించారు. పుణె యూనివర్శిటీలో ఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, హిస్టరీలో మాస్టర్ డిగ్రీ పొందారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..