Share News

ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నడ్డా

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:04 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్రనేతలు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ రాజధాని నగరంలో సోమవారం ప్రత్యక్ష

ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నడ్డా

న్యూఢిల్లీ, జనవరి 22 : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్రనేతలు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ రాజధాని నగరంలో సోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. నగరంలోని ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఆ పార్టీ నాయకులు నగరంలోని ఝండేవాలన్‌ ఆలయంలో, హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తదితర నేతలు లక్ష్మి నారాయణ్‌ ఆలయం, బిర్లా మందిరాల్లో పూజలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌లో 140 దేవాలయాల్లో అయోధ్య వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయగా వేలాది మంది వీక్షించారని ప్రకాశ్‌ జావడేకర్‌ పేర్కొన్నారు. అయోధ్య ఆహ్వానాన్ని రాహుల్‌ తిరస్కరించారని, కానీ.. ఆయన నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆలయాలకు పోటెత్తారని ఆయన చెప్పారు.

Updated Date - Jan 23 , 2024 | 04:04 AM