Share News

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:50 AM

ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్‌ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

  • వయనాడ్‌లో వలంటీర్లకు పంపిణీ

  • ‘సూపర్‌ హీరో’ ప్రజీశ్‌ మిస్సింగ్‌

  • బాధితుల రక్షణకు వెళ్లి గల్లంతు

  • బాధితులను కాపాడేందుకెళ్లి కనిపించకుండాపోయిన ప్రజీశ్‌

వయనాడ్‌, ఆగస్టు 5: ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్‌ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారిలో ప్రజీశ్‌ ఒకరు. ముండక్కైలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియడంతో ప్రజీశ్‌.. తన జీపుతో రెండు సార్లు అక్కడికెళ్లి పలువురిని కాపాడి తీసుకొచ్చాడు.

ఆ తర్వాత తన కుటుంబంతో సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మరోసారి అతడికి ఫోన్‌ వచ్చింది. సాయం కోసం ముండక్కైకి తన జీప్‌లో మరోసారి వెళ్లిన అతడు తిరిగిరాలేదు. చురాల్‌మల్‌ ప్రాంతంలోనే ఓ చోట ధ్వంసమైన అతడి జీపు కనిపించింది. ప్రజీశ్‌ ఆచూకీ తెలియరాలేదని స్థానికులు చెబుతున్నారు. ‘ఎవరికే సాయం కావాలన్నా ప్రజీశ్‌ ముందుండే వాడు. కొందరినైనా కాపాడాలంటూ ఆరోజు వెళ్లాడు. అతడే మా సూపర్‌ హీరో’ అని స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, వయనాడ్‌ విపత్తు మృతుల సంఖ్య 222కు చేరినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - Aug 06 , 2024 | 04:50 AM