Share News

Ram Setu: అంతరిక్షం నుంచి రామ్‌ సేతు ఫొటోలు విడుదల.. ఎంత అద్భుతంగా ఉందంటే

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:28 PM

రామ్ సేతు.. లంకకు చేరుకోవడానికి రాముడు నడయాడిన వారధి అది. సేతుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలెన్నో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సంస్థలు రామ్ సేతు(Ram Setu Photos) ప్రస్తుతం ఎలా ఉందో తెలియజేసే ఫొటోలు విడుదల చేస్తుంటాయి.

Ram Setu: అంతరిక్షం నుంచి రామ్‌ సేతు ఫొటోలు విడుదల.. ఎంత అద్భుతంగా ఉందంటే

ఇంటర్నెట్ డెస్క్: రామ్ సేతు.. లంకకు చేరుకోవడానికి రాముడు నడయాడిన వారధి అది. సేతుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలెన్నో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సంస్థలు రామ్ సేతు(Ram Setu Photos) ప్రస్తుతం ఎలా ఉందో తెలియజేసే ఫొటోలు విడుదల చేస్తుంటాయి. తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కోపర్నికస్ సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన రామసేతు చిత్రాన్ని షేర్ చేసింది.

ram-setu.jpg

అంతరిక్షంలో నుంచి సేతు అత్యద్భుతంగా కనిపిస్తోంది. భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో రామేశ్వరం ద్వీపం, శ్రీలంకలోని మన్నార్ ద్వీపాన్ని కలుపుతూ రామ్ సేతు 48 కి.మీ విస్తరించి ఉంది. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ (దక్షిణం), హిందూ మహాసముద్రం ప్రవేశ ద్వారం నుంచి పాక్ జలసంధిని వేరు చేస్తుంది. వంతెన ఎలా ఏర్పడిందనే దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, లంకకు చేరుకోవడానికి వానర సైన్యం వీటిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది.


నివేదికల ప్రకారం.. ఈ సేతుపై 15వ శతాబ్దం వరకు ప్రయాణాలు జరిగేవి. కాలక్రమేణా తుపానులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇది కోతకు గురైంది. ఇక్కడ కొన్ని ఇసుక తీరాలు ఉన్నాయని, ఇక్కడ సముద్రం చాలా నిస్సారంగా కేవలం 1-10 మీటర్ల లోతులో ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మన్నార్ ద్వీపం.. శ్రీలంక ప్రధాన భూభాగానికి రోడ్డు, రైలు ద్వారా అనుసంధానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ రామసేతు ప్రారంభ ప్రదేశమైన అరిచల్ మునైని సందర్శించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 03:28 PM