Share News

Viral Video: వేదిక మీద పావురం ఎగరలేదు.. చర్యలు తీసుకోండి.. కలెక్టర్‌కు ఎస్పీ లేఖ..!

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:44 PM

ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేళి జిల్లాలో ఆగస్టు 15వ తేదీన పంద్రాగస్టు వేదికలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ శంకర్ జైస్వాల్ పాల్గొన్న ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పన్నూలాల్ మొహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గురూ వేదిక మీదకు వెళ్లి పావురాలను ఎగురవేశారు.

Viral Video: వేదిక మీద పావురం ఎగరలేదు.. చర్యలు తీసుకోండి.. కలెక్టర్‌కు ఎస్పీ లేఖ..!
pigeon released by a police officer is unable to fly

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day celebrations) సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పావురాల (pigeon)ను ఎగురేవేసి శ్రీకారం చుట్టడం అనేది ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, శాంతికి ప్రతీకగా భావించి అధికారులు, ఇతర ముఖ్య నేతలు వేదిక పై నుంచి పావురాలను ఎగురవేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో కూడా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఏర్పాట్లు చేసిన వారిపై జిల్లా ఎస్పీ (S.P.) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు (Viral Video).


ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేళి జిల్లాలో ఆగస్టు 15వ తేదీన పంద్రాగస్టు వేదికలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ శంకర్ జైస్వాల్ పాల్గొన్న ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పన్నూలాల్ మొహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గురూ వేదిక మీదకు వెళ్లి పావురాలను ఎగురవేశారు. అయితే కలెక్టర్, ఎమ్మెల్యే ఎగురవేసిన పావురాలు పైకి ఎగిరిపోయాయి. కానీ, ఎస్పీ ఎగురవేసిన పావురం పైకి ఎగరకుండా కింద పడిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆ ఘటనను ``పంచాయత్-3`` వెబ్ సిరీస్‌తో పోలుస్తున్నారు.


ఆ వెబ్ సిరీస్‌లో కూడా అలాంటి సీన్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు లేఖ రాశారు. అనారోగ్యంతో ఉన్న పావురాన్ని తీసుకురావడం వల్లే ఇలా జరిగిందని, జిల్లా స్థాయి కార్యక్రమానికి అలాంటి పావురం తీసుకురావడం తప్పని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 01:44 PM