8 మంది ఎవరంటే?
ABN , Publish Date - Nov 22 , 2024 | 06:42 AM
భారత్‌లో భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టును దక్కించుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఇవ్వజూపిన వ్యవహారం దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ
భారత్‌లో భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టును దక్కించుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఇవ్వజూపిన వ్యవహారం దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించడం వ్యాపార, రాజకీయ వర్గాల్లో దుమారం సృష్టిస్తోంది. మరి అదానీతో పాటు వారి నేపథ్యం ఏమిటి?
1 గౌతమ్ అదానీ
ప్రపంచంలోనే 18వ అత్యంత ధనవంతుడు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం రూ.7.17 లక్షల కోట్ల (85 అమెరికన్ బిలియన్ డాలర్లు) ఆస్తి ఈయన సొంతం. 1962లో గుజరాత్‌లోని జన్మించారు. 16వ ఏటనే చదువుకు స్వస్తి చెప్పారు. కమోడిటీస్ ట్రేడింగ్ సంస్థగా 1988లో అదానీ గ్రూప్‌ను స్థాపించారు. ప్రస్తుతం విద్యుత్తు, షిప్పింగ్, ఇంధన, మైనింగ్ వంటి పలు రంగాలకు విస్తరించింది.
2. సాగర్ అదానీ
గౌతమ్ అదానీ తమ్ముడు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ రాజేష్ అదానీ కుమారుడీయన. సాగర్.. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తయ్యాక 2015లో అదానీ గ్రూప్‌లో చేరారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ (పవన్, సౌర విద్యుత్తు) రంగాల్లో అభివృద్ధి వెనుక ఉన్నది సాగర్. ఈ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
3. సిరిల్ కాబేన్స్
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ పౌరసత్వం ఉన్న ఈయన సింగపూర్‌లో నివసిస్తున్నారు. అజూర్ పవర్ గ్లోబల్ మాజీ డైరెక్టర్. కెనడా సంస్థాగత పెట్టుబడిదారు సంస్థ సీడీపీక్యూలో పనిచేశారు. 2016-23 మధ్య సీడీపీక్యూలో ఆసియా, పసిఫిక్, పశ్చిమాసియా వ్యవహారాల ఎండీగా వ్యవహరించారు. 2017 జనవరి నుంచి గత ఏడాది అక్టోబరు దాకా కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
4.వినీత్ జైన్
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవో. 15 ఏళ్లుగా అదానీ సంస్థలో పనిచేస్తున్నారు. ఇంధన, మౌలిక వసతుల రంగ వ్యాపారాల్లో అనేక కీలక ప్రాజెక్టుల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించారు.
5. రంజిత్ గుప్తా
అజూర్ పవర్ గ్లోబల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఈయన. ప్రస్తుతం ఇంధన సంస్థ ఓసియోర్ ఎనర్జీకి సీఈవోగా ఉన్నారు.
6. రూపేష్ అగర్వాల్
అజూర్ పవర్ గ్లోబల్‌కు మాజీ చీఫ్ స్ట్రాటజీ- కమర్షియల్ ఆఫీసర్. 2022 జూలై-ఆగస్టు సమయంలో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) రెన్యూవబుల్ ఎనర్జీ సీఈవో కౌన్సిల్‌కు కో చైర్‌గా ఉన్నారు.
7.సౌరభ్ అగర్వాల్
భారత్‌కు చెందిన ఈయన కెనడియన్ ఇన్వెస్టర్ సంస్థ సీడీపీక్యూలో 2018 నుంచి 2023 అక్టోబరు వరకు పనిచేశారు.
8.దీపక్ మల్హోత్రా
ఈయన కూడా సీడీపీక్యూలో విధులు నిర్వర్తించారు. సిరిల్ కాబేన్స్‌కు 2017 మే నుంచి 2023 వరకు రిపోర్ట్ చేశారు.