Share News

WhatsApp: భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా? పార్లమెంట్‌లో ఐటీ మంత్రి ఏం చెప్పారంటే..!

ABN , Publish Date - Jul 30 , 2024 | 02:47 PM

భారతదేశంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయా? వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారత్‌లో తన సేవలను నిలిపివేయాలని అనుకుంటోందా? ఇదే ప్రశ్న పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎదురైంది.

WhatsApp: భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా? పార్లమెంట్‌లో ఐటీ మంత్రి ఏం చెప్పారంటే..!
whatsapp

భారతదేశం (India)లో వాట్సాప్ (WhatsApp) సర్వీసులు నిలిచిపోతాయా? వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారత్‌లో తన సేవలను నిలిపివేయాలని అనుకుంటోందా? ఇదే ప్రశ్న పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు (Ashwini Vaishnaw) ఎదురైంది. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా (Vivek Tankha) అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో అశ్వినీ వైష్ణవ్ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


భారత్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు సదరు సంస్థ లేదా దాని మాతృసంస్థ అయిన మెటా నుంచి తమకు ఎలాంటి సమాచారమూ ఇంత వరకు రాలేదని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇండియాలో వాట్సాప్‌ సేవలను నిలిపివేయాలనే ఆలోచన సదరు సంస్థకు లేదని తాము భావిస్తున్నామని చెప్పారు. వాట్సాప్‌లో వినియోగదారుల వివరాలు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (end-to-end encryption) విధానంలో ఉంటాయి. మెసేజ్ పంపిన వారు, అందుకున్న వారు తప్ప వాట్సాప్‌తో సహా ఇతరులు ఎవ్వరికీ ఎలాంటి వివరాలూ తెలియవు.


దేశ భద్రత దృష్ట్యా ఆ ఎన్‌క్రిప్టెడ్ విధానాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఐటీ నిబంధనలను సవరించింది. ఈ సవరింపుపై మెటా సంస్థ గతేడాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మెసేజ్ ఎన్‌క్రిప్టెడ్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే భారత్‌లో తమ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. కేంద్రం సవరించిన చట్టాలు గోపత్యా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కోర్టును ఈ ఏడాది జనవరిలో మెటా ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఫ్రిడ్జ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటో అని వెనక్కి తిప్పి చూసిన ఇంటి వారికి దిమ్మదిరిగే షాక్!

Zomato: పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసిన కస్టమర్.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్.. జొమాటో రియాక్షన్ ఏంటంటే..


Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!


Viral Video: ఇంత పిచ్చి ఏంటి అమ్మా.. పిల్లాడిని ఎత్తుకుని రీల్స్ కోసం డ్యాన్స్.. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2024 | 02:47 PM