జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఉపసంహరణ?
ABN , Publish Date - Mar 28 , 2024 | 04:09 AM
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎ్‌ఫఎ్‌సపీఏ) ఉపసంహరించుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.
పరిశీలించనున్నట్లు అమిత్ షా వెల్లడి
చట్టాన్ని ఉపసంహరిస్తే సైన్యం వెనక్కి
శాంతి భద్రతల బాధ్యతలు కశ్మీర్ పోలీసులకే
సెప్టెంబరుకన్నా ముందే కశ్మీర్‌లో ఎన్నికలు’
జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేత!
8 పరిశీలిస్తామన్న కేంద్ర మంత్రి అమిత్‌షా
8 సెప్టెంబరుకన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎ్‌ఫఎ్‌సపీఏ) ఉపసంహరించుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుని శాంతిభద్రతలకు సంబంధించిన బాధ్యతలను జమ్మూకశ్మీర్ పోలీసులకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఏఎ్‌ఫఎ్‌సపీఏను ఉపసంహరించుకోవాలని జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు, వ్యక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఏఎ్‌ఫఎ్‌సపీఏను ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించనున్నట్టు షా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని, కానీ ఇప్పుడు వాళ్లు ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారని షా చెప్పారు. కల్లోలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే సైన్యం అవసరం అనుకుంటే సోదాలు, అరె్‌స్టలు చేయడానికేకాకుండా కాల్పులు జరపడానికి కూడా ఏఎ్‌ఫఎ్‌సపీఏ విస్తృత అధికారాలను కల్పిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్ ఎస్‌పీఏ అమల్లో ఉన్నప్పటికీ ఈశాన్యరాష్ట్రాల్లోని 70 శాతం ప్రాంతాల్లో దీన్ని తొలగించినట్టు ఇంతకు ముందు షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరుకన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అమిత్‌షా పేర్కొన్నారు. సెప్టెంబరుకన్నా ముందే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇంతకు ముందే సుప్రీం కోర్టు ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం ప్రధాని నరేంద్ర మోదీ హామీ అన్న షా దాన్ని నెరవేర్చనున్నట్టు చెప్పారు.