పీఎఫ్ సొమ్ము ఏటీఎం ద్వారా విత్‌డ్రా
ABN , Publish Date - Dec 12 , 2024 | 05:14 AM
ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు తమ పీఎ్‌ఫను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.
జనవరిలో అందుబాటులోకి... కేంద్రం యోచన
న్యూఢిల్లీ, డిసెంబరు 11: ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు తమ పీఎ్‌ఫను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. 2025 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. చందాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను ఐటీ వ్యవస్థలను ఆధునీకీకరిస్తున్నామని, క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కార్డును జారీ చేయనుంది. ప్రస్తుతం ఈపీఎ్‌ఫవోలో 7కోట్ల మందికి పైగా చందాదారులున్నారు.