Beauty Tips : కంటికి ఇంపుగా
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:26 AM
చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మేకప్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉత్పత్తులను తగు మాత్రంగా వాడుకోవడంతో పాటు, చర్మానికి నప్పే సౌందర్యసాధనాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే!
మేకప్
చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మేకప్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉత్పత్తులను తగు మాత్రంగా వాడుకోవడంతో పాటు, చర్మానికి నప్పే సౌందర్యసాధనాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే!
లిప్‌స్టిక్ ఇలా...
డార్క్ స్కిన్ కలిగిన వాళ్లు లేత రంగు లిప్‌స్టిక్స్ ఎంచుకోవాలి. బీజ్, పేల్ పింక్, న్యాచురల్ కలర్, పేల్ బ్రౌన్ రంగులు వీళ్లకు బాగుంటాయి. అయితే లిప్‌లైనర్ కచ్చితంగా వాడుకోవాలి. పెదవుల ఔట్‌లైన్ గీసుకునేటప్పుడు, అవసరానికి మించి పెదవులను దాటనీయకూడదు. లిప్‌లైనర్‌తో లిప్‌స్టిక్ రంగు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే పెదవుల రంగు సహజసిద్ధంగా కనిపిస్తుంది.
ఐలైనర్ ఇలా...
చిక్కని కనురెప్పల వెంట్రుకలు కలిగినవాళ్లు కనురెప్పల మీద సన్నని లైన్ గీసుకోవాలి. కంటి చివర్లో వంపు తిప్పాలా వద్దా అనేది కంటి ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. సోగ కళ్లయితే, కంటి చివర్లో వంపు బాగుంటుంది. చిన్న కళ్లు ఉన్నవాళ్లు ఐలైనర్‌ను మందంగా అప్లై చేసుకోవాలి. కింది కనురెప్పకు కూడా మస్కారా అప్లై చేయాలి.
బ్లష్ ఇలా...
బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉండాలని అవసరానికి మించి బ్లష్ అప్లై చేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి డ్రస్‌తో మ్యాచ్ అయ్యే బ్లష్‌ను బ్రష్‌తో అద్దుకున్న తర్వాత, అరచేతి మీద రుద్దుకోవాలి. అలా చేయడం వల్ల అదనపు బ్లష్ వదిలిపోతుంది. ఆ తర్వాత చీక్ బోన్స్ నుంచి చెవుల వైపుకు బ్రష్‌ను కదిలిస్తూ బ్రష్ అద్దుకోవాలి.
ఐ షాడో ఇలా...
ఐ షాడో కూడా డ్రస్‌కు మ్యాచ్ అయ్యేలాచూసుకోవాలి. స్మోకీ ఐస్ కోసం డార్క్ బ్రౌన్ షాడో బాగుంటుంది. ఐషాడో, ఐలైనర్ కలిసిపోయేలా అప్లై చేసుకుంటే స్మోకీ ఐస్ సొంతమవుతాయి. కనురెప్పలు పెద్దవిగా కనిపించాలనుకుంటే, కనురెప్ప మధ్యలో లైన్ గీసి, కనుబొమల వరకూ తేలికపాటి షాడో, ఐల్యాషెస్ వరకూ ముదురురంగు షాడో వేసుకోవాలి.