White Hair: తెల్లజుట్టు ఉందా? కొబ్బరి నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..!
ABN , Publish Date - Feb 02 , 2024 | 07:48 PM
Best Tips for Premature White Hair: ప్రస్తుత కాలంలో, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. దీని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. తెల్ల జుట్టు రావడానికి జన్యుపరమైన కారణాలు..
Best Tips for Premature White Hair: ప్రస్తుత కాలంలో, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. దీని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. తెల్ల జుట్టు రావడానికి జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు. కానీ, సాధారణంగా అనారోగ్యకరమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కూడా తెల్ల జుట్టు రావడానికి కారణంగా చెప్పవచ్చు. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చడానికి చాలా మంది హెయిర్ డై వాడుతుంటారు. కానీ ఇది సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది జుట్టును అసహజంగా, పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. నల్లటి జుట్టు మళ్లీ రావడానికి కొబ్బరి నూనె, మరికొన్ని పదార్థాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటి సహాయంతో సహజమైన నల్లటి జుట్టును పొందవచ్చునని అంటున్నారు. మరి టిప్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం..
కొబ్బరి నూనె, మెహందీ..
కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇక హెన్నా విషయానికి వస్తే ఇది జుట్టుకు సహజమైన రంగును ఇస్తుంది. కొబ్బరి నూనెలో గోరింటాకును మిక్స్ చేసి.. దానిని వినియోగిస్తే తెల్ల జుట్టు క్రమంగా తగ్గి.. నల్ల జుట్టు పెరుగుతుంది. ఇందుకోసం ముందుగా గోరింట ఆకులను ఎండలో ఆరబెట్టాలి. 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను మరిగించాలి. ఈ నూనెలో ఎండిన హెన్నా ఆకులను వేసి.. నూనెలో రంగు కనిపించేంత వరకు బాగా కలపాలి. ఆ తరువాత మంటను ఆపేయాలి. తర్వాత గోరువెచ్చగా అయిన తరువాత జుట్టుకు నూనె రాయాలి. సుమారు 30 నిమిషాల తరువాత.. జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా నిత్యం చేస్తుంటే తెల్ల జుట్టు కాస్తా నలుపు రంగులోకి వస్తుంది.
కొబ్బరి నూనె, ఉసిరి..
తెల్ల జుట్టును వదిలించుకోవడానికి.. కొబ్బరి నూనె, ఉసిరి మిశ్రమం ప్రయోజనకరమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఉసిరికాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేద పరంగా ఇది ఒక దివ్యౌషధం. ఉసిరికాయ చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కొల్లాజెన్‌ని పెంచే శక్తి ఈ ఉసిరికాయలో ఉంది. ఉసిరికాయలో పెద్ద మొత్తంలో ఆరిల్, విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 4 చెంచాల కొబ్బరి నూనెలో 2 నుండి 3 చెంచాల ఉసిరి పొడిని కలపాలి. దానిని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ఈ పేస్ట్ చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మీద మసాజ్ చేయాలి. రాత్రి అంతా అలాగే ఉంచి.. ఉదయం తలని శుభ్రంగా కడుక్కోవాలి. దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. తెల్ల జుట్టు కాస్తా నల్లగా మారుతుంది.