Navya : నారింజ తొక్కతో నాజూకు!
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:35 AM
నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే..
నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే.. హాయిగా ఫేస్మా్స్కగానూ ఉపయోగించుకోవచ్చు. ఎ-విటమిన్, సి-విటమిన్ ఉండే నారింజ తొక్కల పొడితో నాజూగ్గానూ తయారు కావొచ్చిలా...
నారింజ పండ్లు తింటూ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ తొక్కతో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకో విషయం తెలుసా.. నారింత తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే.. హాయిగా ఫేస్మా్స్కగానూ ఉపయోగించుకోవచ్చు. ఎ-విటమిన్, సి-విటమిన్ ఉండే నారింజ తొక్కల పొడితో నాజూగ్గానూ తయారు కావొచ్చిలా..
బౌల్లో టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడితో పాటు టేబుల్ స్పూన్ పెరుగు వేసి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పొడిలోకి టీస్పూన్ తేనె, కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
నారింజ తొక్క పొడిలోకి అంతే పరిమాణంలో సున్నిపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టిస్తే మృతకణాలు తొలగిపోతాయి.
బౌల్లో టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పొడిలో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ పాలు కలిపి చూర్ణం చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
ముందుగా ఆరెంజ్ పీల్ పౌడర్‌ను టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి చూర్ణం చేయాలి. అవసరమైతే పేస్ట్‌కు తగినట్లు నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మచ్చలు మాయమవుతాయి.
బౌల్లో టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిని తీసుకుని అందులో టీస్పూన్ చక్కెర, టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి చూర్ణం చేసుకోవాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. చర్మం మీద స్క్రబ్‌లా అప్లయ్ చేసుకోవటం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
ఆరెంజ్ పీల్ పౌడర్‌ను నీళ్లతో కలిపి ముఖానికి పట్టించుకుంటే చాలు.. చర్మంలో నూనె శాతం తగ్గుతుంది. యువీ కిరణాల బారిన నుంచి రక్షించే గుణం ఈ పొడికి ఉంది. ఇందువల్ల వృద్ధాప్యఛాయలు త్వరగా దరిచేరవు.