Share News

Blood Diet : రక్తగ్రూపును బట్టి ఆహారం!

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:45 AM

తీసుకునే ఆహారం శరీర తత్వంతో సరిపోలితే అనారోగ్యాలను కలిగించే జిహ్వచాపల్యాలకు దూరంగా ఉండగలుగుతాం! ఈ సూత్రం ఆధారంగా వాడుకలోకొచ్చిన తాజా డైట్‌...‘బ్లడ్‌ గ్రూప్‌ డైట్‌’!

Blood Diet : రక్తగ్రూపును బట్టి ఆహారం!

బ్లడ్‌ గ్రూప్‌ డైట్‌

తీసుకునే ఆహారం శరీర తత్వంతో సరిపోలితే అనారోగ్యాలను కలిగించే జిహ్వచాపల్యాలకు దూరంగా ఉండగలుగుతాం! ఈ సూత్రం ఆధారంగా వాడుకలోకొచ్చిన తాజా డైట్‌...‘బ్లడ్‌ గ్రూప్‌ డైట్‌’!

‘ఒ’ రక్త గ్రూపు: మిగతా రక్తగ్రూపులతో పోలిస్తే ఒ రక్తగ్రూపు వ్యక్తుల పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే వీళ్లు శారీరకంగా ఎంతో చురుకుగా కూడా ఉంటారు. ఈ కోవకు చెందినవారు....

తినవలసినవి: అత్యధిక మాంసకృత్తులు కలిగి ఉండే ఆహారం తినాలి. ఇందుకోసం పచ్చిబఠాణీ, పాలు, జున్ను, అవకాడో, చిక్కుళ్లు, పప్పులు, విత్తనాలు తినాలి.

  • మాంసకృత్తులను శరీరం శోషించుకోవడం కోసం ఎక్కువగా నీళ్లు కూడా తాగుతూ ఉండాలి.

  • మాంసకృత్తులు, ఇతర పోషకాలను శరీరం తేలికగా, త్వరగా శోషించుకోవడం కోసం ఎక్కువగా ఇనుము ఉండే ఆహారం కూడా తింటూ ఉండాలి. ఇందుకోసం ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తినాలి.

  • క్షార గుణం కలిగి ఉండే బెర్రీ పళ్లు, యాపిల్స్‌, మామిడిపళ్లు, అరటిపళ్లు తినాలి.

తినకూడనివి: విటమిన్‌ మాత్రలు, ప్రొటీన్‌ పౌడర్లు

  • పుల్లని పళ్లు

  • వెన్న, సోయాపాలు, మొదలైనవి తక్కువగా తినాలి. లేదంటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.

‘ఎ’ రక్తగ్రూపు: ఈ గ్రూపు వ్యక్తులకు హృద్రోగాలు, కేన్సర్‌, మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ. ఈ వ్యక్తులు సున్నితమైన శరీర తత్వం కలిగి ఉంటారు. కాబట్టి సాఽధ్యమైనంతవరకూ సహజసిద్ధ రూపంలో ఉండే ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి. వీరి పొట్టలో ఆమ్ల ఉత్పత్తి తక్కువ కాబట్టి తేలికగా అరిగే పదార్థాలే తినాలి.

తినవలసినవి: పళ్ల రసాలు. ఇవి శరీరంలో నీటి శాతాన్ని స్థిరంగా ఉంచడంతోపాటు ఈ రక్తగ్రూపుకు మేలు చేస్తాయి.

  • సోయా, టోఫు, విత్తనాల ద్వారా సరిపడా మాంసకృత్తులు పొందవచ్చు.

  • కూరగాయల ద్వారా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు పొందాలి.

తినకూడనివి: పాల ఉత్పత్తులు జీర్ణం కావడం కష్టం కాబట్టి వీలైనంత తక్కువ తీసుకోవాలి.

  • బంగాళాదుంపలు, చిలకడదుంపలు, క్యాబేజీ, టమాటాలలో ఉండే పెప్టిన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణం కాదు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

‘బి’ రక్తగ్రూపు: ఈ గ్రూపుకు చెందిన ఆహారం సమతులంగా ఉండి, పరిపూర్ణంగా కూడా ఉంటుంది. ఈ గ్రూపు వ్యక్తులు ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగలరు. కాబట్టి ఆహారంలో ఎన్నో రకాల పదార్థాలను చేర్చుకోవచ్చు. కూరగాయలు, పళ్లు, పాల ఉత్పత్తులు....సమస్తం వీళ్లు తినవచ్చు.

‘ఎబి’ రక్తగ్రూపు: ఇది అరుదైర రక్తగ్రూపు. వీరికి ‘ఎ’, ‘బి’....ఈ రెండు రక్తగ్రూపుల లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు గ్రూపులకు చెందిన ఆహారం తింటూ ఒంట్లో ఆమ్ల తత్వాన్ని స్థిరంగా ఉంచకోవాలి. ఇందుకోసం....

తినవలసినవి: పాల ఉత్పత్తులు వీరికెంతో మేలు చేస్తాయి. కాబట్టి పాలు, పెరుగు, వెన్న, జున్ను... తింటూ ఉండాలి.

  • బీన్స్‌, చిక్కుళ్లు, సోయా, వేరుసెనగపప్పు, పెసలు తింటూ ఉండాలి.

  • బీట్‌రూట్‌, బ్కొకొలి, దోస, వంకాయ ఎక్కువగా తినాలి.

  • శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉంచడం కోసం ఎక్కువగా పళ్లరసాలు తాగుతూ ఉండాలి.

తినకూడనివి: మాంసాహారం.

Updated Date - Sep 03 , 2024 | 12:45 AM