Wife and Husband: భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా.. మన చట్టం ఏం చెబుతుంది..
ABN , Publish Date - Nov 25 , 2024 | 06:37 PM
పెళ్లయ్యాక కొంతమంది తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయంపై తమకు హక్కు ఉందని భావిస్తారు. కాబట్టి వారు తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటారు. అయితే, భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా? మన చట్టం ఏం చెబుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం..
Wife and Husband: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్నింగ్ లేచినప్పుడు నుండి నైట్ పడుకునే వరకు వాటితోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే, పెళ్లయ్యాక కొంతమంది తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతిదానిపై తమకు హక్కు ఉందని భావిస్తారు. కాబట్టి వారు తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటారు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం ప్రారంభిస్తారు.
భారత చట్టం ఏం చెబుతోంది? :
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం , ప్రతి ఒక్కరికీ గోప్యత హక్కు ఇవ్వబడింది. దీని ప్రకారం ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి ఫోన్ లేదా సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయలేరు. తప్పక చూడాలంటే ముందుగా జీవిత భాగస్వామి అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆర్టికల్ 21 అంటే ఏమిటి?:
మన దేశంలోని చట్టం ప్రకారం ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత విషయాలను ఇతరుల నుండి దాచడానికి పూర్తి హక్కు ఉంటుంది. 2017లో మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గోప్యత హక్కు చాలా ముఖ్యమైనదని, దానిని ఎప్పటికీ తీసివేయలేమని చెప్పింది.
Also Read: