Share News

Marriage: మేనరికాలు, బావా-మర్ధళ్ల పెళ్ళిళ్లు చాలా డేంజర్.. సైన్స్ చెబుతున్న షాకింగ్‌ నిజాలు..

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:42 PM

చాలామంది బావా మర్ధళ్లు, లేదంటే మావయ్యను పెళ్ళి చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇది మన సర్కిల్‌లో ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే, ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకుందాం..

Marriage: మేనరికాలు, బావా-మర్ధళ్ల పెళ్ళిళ్లు చాలా డేంజర్.. సైన్స్ చెబుతున్న షాకింగ్‌ నిజాలు..
Marriage

Marriage: చాలామంది బావా మర్ధళ్లు, లేదంటే మావయ్యను, కజిన్స్‌ని పెళ్ళి చేసుకోవడం లాంటివి మనం చూస్తుంటాం. ఇది మన సర్కిల్‌లో ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే, ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. దీన్ని కాన్‌శాన్‌గ్వినిటీ(Consanguinity) అని పిలుస్తారు. కాన్‌శాన్‌గ్వినిటీ అంటే రక్తసంబంధం, దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం. ఈ తరహా పెళ్ళిళ్లు భారత్‌ లో సుమారు 13.6శాతం జరుగుతున్నాయి. సౌతిండియాలో అత్యధికంగా 53 శాతం ఇలాంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పెళ్ళిళ్లు జరుగుతున్నాయి.


జన్యు సంబంధిత వ్యాధులు..

కాన్‌శాన్‌గ్వినిటీ వల్ల పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు 30శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా జంటలకు పుట్టిన పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగడం ఆలస్యం అవుతుంది. నాడీ సమస్యలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దగ్గర బంధువులను పెళ్ళి చేసుకోవడం వల్ల వారి పిల్లల్లో జన్యు సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

చిన్నతనంలోనే..

థలాసీమియాతో పాటు సిస్టిక్ ఫైబ్రోసిస్ సమస్యలు కూడా వస్తాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన డిజీజ్‌. ఇక ఈ తరహా పెళ్ళిళ్లు చేసుకున్న వారి పిల్లలు చిన్నతనంలో మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. నవజాత శిశువు మరణాలు కూడా ఎక్కువేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గర్భస్రావాల ఛాన్సులు కూడా అధికంగా ఉంటాయి.


నిజానికి ఈ కాన్‌శాన్‌గ్వినిటీ కొన్ని మతాలు సంప్రాదాయాలతో ముడిపడి ఉన్న అంశం. ఇస్లామిక్ సంప్రదాయాల కారణంగా ముస్లిం దేశాలలో కాన్‌శాన్‌గ్వినిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్‌లో 61శాతం, కువైట్ 54శాతం పెళ్ళిళ్లు బంధువుల మధ్యే జరుగుతాయి. ఇక విభిన్న సంస్కృతులు కలిగిన దేశాల్లో ఈ రేటు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా, రష్యాలలో ఈ రేటు 0.1శాతం మాత్రమే ఉంటుంది. అక్కడ పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు రావడం అందుకే అరుదుగా జరుగుతుంటుంది.

Also Read:

వీడెవడ్రా బాబు.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు..

Updated Date - Nov 25 , 2024 | 02:43 PM