Share News

Eye care : కూలింగ్‌ గ్లాసెస్‌ అవసరమే!

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:12 AM

ఎండాకాలమే కాదు, అన్ని కాలాల్లోనూ చలువ కళ్లజోడు ఉపయోగకరమే! అన్ని కాలాల్లోనూ ఎండలో అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్‌ కలిసి ఉంటాయి.

Eye care : కూలింగ్‌ గ్లాసెస్‌ అవసరమే!

ఐ కేర్‌

ఎండాకాలమే కాదు, అన్ని కాలాల్లోనూ చలువ కళ్లజోడు ఉపయోగకరమే! అన్ని కాలాల్లోనూ ఎండలో అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్‌ కలిసి ఉంటాయి. కాబట్టి వాటి నుంచి కళ్లకు రక్షణ కల్పించాలంటే చలువు కళ్లద్దాలు ధరించాలి.

సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల కూలింగ్‌ గ్లాసెస్‌ దొరుకుతూ ఉంటాయి. వాటిలో చవకవీ, ఖరీదైనవీ ఉంటాయి. వీటిలో ఏది కొనాలో అర్థం అవక, అయోమయానికి గురవుతూ ఉంటాం. అయితే చలువ కళ్లద్దాలు వేటితోనైనా కళ్లకు రక్షణ దొరుకుతుంది. అయితే వాటికి అతినీలలోహిత కిరణాలను ఆపే ‘యువి ప్రొటెక్షన్‌’ ఉందా? అనేది తెలుసుకోవాలి. చవక చలువ కళ్లద్దాలతో పోలిస్తూ ఖరీదైన ప్రముఖ కంపెనీ ఉత్పత్తులు ఈ ఫిల్మ్‌ విషయంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తాయి. కాబట్టి కళ్లకు పూర్తి రక్షణ కోరుకుంటే, మన్నికైన, నాణ్యమైన కూలింగ్‌ గ్లాసె్‌సనే ఎంచుకోవాలి. తక్కువ ఖర్చులో చలువ కళ్లజోడు కొనే సమయంలో వాటి అద్దాల నాణ్యత పరిశీలించాలి. ఛత్వారం ఉన్న వాళ్లు ఎండ సోకితే నల్లబడే ‘ఫొటోక్రోమ్‌’ జోడు ఎంచుకోవాలి.

Updated Date - Nov 05 , 2024 | 12:12 AM