Fashion : చందేరి చమక్కులు
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:31 AM
తేలికగా ఉండే ఫ్యాబ్రిక్ చందేరి. దీంతో చీరలే కాదు, షల్వార్ కమీజ్‌లూ, సూట్లు కూడా తయారుచేస్తూ ఉంటారు.
ఫ్యాషన్
తేలికగా ఉండే ఫ్యాబ్రిక్ చందేరి. దీంతో చీరలే కాదు, షల్వార్ కమీజ్‌లూ, సూట్లు కూడా తయారుచేస్తూ ఉంటారు. ఫ్లవర్ డిజైన్లలో ఆహ్లాదకరంగా కనిపించే చందేరి సూట్స్ మీద ఓ లుక్కేద్దామా?
దుపట్టా ఇలా...
చందేరీ సూట్‌కు దుపట్టా ఉన్నా, లేకపోయినా ఫర్వాలేదు. రౌండ్ లేదా వి నెక్ డ్రస్‌లు అమ్మాయిలందరికీ నప్పుతాయి. టాప్ పొడవు మోకాళ్ల కింద వరకూ ఉంటే, ప్యాంట్ స్టైల్‌లో ఉండే బాటమ్ ధరించాలి. ఫెస్టివ్ లుక్ రప్పించాలనుకుంటే, మెరుసే సెక్విన్లతో కూడిన డ్రస్ ఎంచుకోవాలి.
స్టైల్‌గా... హుందాగా...
సిల్క్, గోల్డెన్ జరీల కలనేతతో రూపొందే చందేరీ సూట్లు హూందాగా ఉంటాయి. ఈవినింగ్ పార్టీలు, పెళ్లిళ్లలో టీనేజీ అమ్మాయిలు ధరించడానికి అనువుగా ఉండే ఈ దుస్తులు లేటెస్ట్ ఫ్యాషన్‌గా చలామణీ అవుతున్నాయి. హాఫ్ వైట్ మీద ఆకర్షణీయమైన రంగుల్లోని పువ్వులు, లతల డిజైన్లు చందేరీ ప్రత్యేకతలు. చూడడానికి భారీగా కనిపించినా, ధరించడానికి తేలికగా ఉంటాయి కాబట్టి చందేరీ దుస్తులు మహిళలను ఆకర్షిస్తూ ఉంటాయి.
అదనపు హంగులు ఇలా...
సెక్విన్లు, డోరీలు, భారీ చున్నీలు చందేరీ డ్రస్సుల ప్రత్యేకత. సాధారణంగా అనార్కలి స్టైల్‌లో రూపొందే చందేరీ సూట్లు నాజూకుగా ఉండే అమ్మాయిలకు చాలా బాగా నప్పుతాయి. అడుగున అదే రంగు లెగ్గింగ్ వేసుకుని, పాదాలకు ఫ్లాట్స్ ధరించే చందేరీ లుక్ పూర్తవుతుంది. ఈ దుస్తులకు సింపుల్, మెటల్ జ్యువెలరీ సూటవుతుంది. లేయర్డ్ స్టైల్ చందేరీ దుస్తులైతే హీల్స్ వేసుకోవచ్చు.