Morning Tips: ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నారా.. ఆర్థిక సమస్యలు తప్పవు..
ABN , Publish Date - Nov 13 , 2024 | 09:12 AM
ఉదయం నిద్రలేవగానే ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఎంత కష్టపడ్డా విజయం సాధించలేరు. అదృష్టం మీ వైపు ఉండదు. ఉదయం ఏం పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
Morning Tips: హిందూ మతంలో జ్యోతిష్యానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జ్యోతిష్య శాస్త్రంలోని విషయాలను అనుసరించినట్లయితే వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దరిద్రం మనల్ని వెంటాడుతూ.. అదృష్టం మన నుండి దూరం అవుతుంది. అంతేకాకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం చెబుతుంది. రోజూ ఉదయం లేవగానే చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని పాటిస్తే జీవితంలో చికాకులు దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
1. అద్దం వైపు చూడడం:
మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని చూసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిద్రలేచిన వెంటనే అద్దాన్ని చూడటం వల్ల రోజంతా పాడవుతుంది. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే ఆ అలవాటును మానుకోండి. ఉదయం పూట నిద్రలేవగానే సోమరితనంతో అద్దాన్ని చూడటం వల్ల శరీరంలో నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీంతో ఆ రోజంతా ఏ పని చేసినా పూర్తి కాదు. జీవితంలో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ, స్నానం చేసిన తర్వాత అద్దం చూడవచ్చు.
2. నీడను చూడడం:
ఉదయం నిద్రలేచిన తర్వాత మీ నీడను చూడటం మాంచిది కాదు. జ్యోతిష్యం ప్రకారం.. ఉదయాన్నే ఒక వ్యక్తి తన నీడను చూడటం ఆశుభమైనదిగా పరిగణించబడుతుంది. తన నీడనే కాకుండా ఇతరుల నీడను కూడా చూడకుండా ఉండాలి. ఒక వేళ అలా చూసినట్లయితే వ్యక్తి జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది.
3. మురికి పాత్రలను చూడడం:
ఉదయం నిద్రలేచిన తర్వాత మురికి పాత్రలను చూడకుండా ఉండాలి. ఉదయం పూట మురికి పాత్రలు కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు. రాత్రి నిద్రపోయే ముందే మురికి పాత్రలు కడగడం మంచిదని శాస్త్రం చెబుతుంది.
4. విరిగిన విగ్రహం చూడడం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత విరిగిన దేవుళ్ల, దేవతల విగ్రహాలను చూడటం అశుభం. దీని వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో అలాంటి విగ్రహం ఉంటే వెంటనే ఇంట్లోంచి తీసేయండి.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ABN దీనిని ధృవీకరించలేదు.)