Hair Care Tips: స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు.. కావాలంటే ట్రై చేయండి..
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:19 PM
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే, స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Hair Care Tips: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు సమస్యలు అన్ని వయసుల వారికి సర్వసాధారణంగా మారాయి. కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడితే జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. తలస్నానం చేసేటప్పుడు మీ జుట్టును శుభ్రంగా కడగకపోతే, షాంపూలోని రసాయనాలు అలాగే ఉండి మీ జుట్టును పాడు చేస్తాయి. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. అయితే, ఈ సమస్యను తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం తగ్గడం లేదా? తరచూ షాంపూ, ఆయిల్ మార్చుకున్నా జుట్టు రాలుతునే ఉందా? అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
సల్ఫేట్ లేని షాంపూ..
తలస్నానం చేసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించి మీ జుట్టును కడగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేస్తే జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు.
వారానికి 2-3 సార్లు..
రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతుంది. దీని వల్ల స్కాల్ప్ లో ఉండే సహజసిద్ధమైన నూనె నశించి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీని నివారణకు వారానికి 2-3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
వేడి నీటితో స్నానం చేయవద్దు..
చాలా వేడి నీటితో స్నానం చేయవద్దు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. మీరు తలస్నానం చేసేటప్పుడు మీ జుట్టును శుభ్రంగా కడగకపోతే, షాంపూలోని రసాయనాలు మీ జుట్టును పాడు చేస్తాయి. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు.
నూనె రాసుకోండి..
నూనె రాసుకోకుండా జుట్టు కడగడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. దీనిని నివారించాలంటే తలస్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది. జుట్టుకు బాగా నూనె రాసి మసాజ్ చేసి కనీసం వారానికోసారైనా తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు తాజా కలబంద జెల్‌ను జుట్టు చివర్లలో అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచి జుట్టును కడగాలి. ఇది జుట్టు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
(Note:పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)