Regain Energy : అలసిన కాళ్లకు స్వాంతన
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:46 AM
మన శరీరంలో ఎక్కువ శ్రమకు లోనయ్యేవి కాళ్లే! శరీర బరువును మోస్తూ రోజంతా నడుస్తూ ఉండే కాళ్లు సాయంత్రానికి విపరీతంగా అలసిపోతాయి.
రెమెడీ
మన శరీరంలో ఎక్కువ శ్రమకు లోనయ్యేవి కాళ్లే! శరీర బరువును మోస్తూ రోజంతా నడుస్తూ ఉండే కాళ్లు సాయంత్రానికి విపరీతంగా అలసిపోతాయి. దాంతో కాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇలాంటప్పుడు నొప్పులు తగ్గి, శక్తి పుంజుకునేలా ఈ చిట్కా పాటించండి.
అర బక్కెట్‌లో వేడి నీళ్లు నింపి, 4 చుక్కల యూకలిప్టస్ ఆయిల్, చెరో రెండు చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్, క్లోవ్ ఆయిల్(లవంగ నూనె) వేసి, కలిపి పాదాలు మునిగేలా ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత కాళ్లను చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.