Health Tips : ఐరన్ కావాలా... ఇవి తినండి
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:21 AM
మహిళల్లో ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే. ఐరన్ లోపంవల్ల రక్తహీనత, నీరసం...
మహిళల్లో ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే. ఐరన్ లోపంవల్ల రక్తహీనత, నీరసం, రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం!
పప్పు ధాన్యాలు: కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వేరుశనగ వంటి పప్పుల్లో ఐరన్ మినరల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉడికించి సూప్‌లు, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. రోజుకొక పప్పు రకాన్ని సైడ్ డిష్‌గా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన ఐరన్‌ను అందించడమే కాకుండా జీర్ణక్రియ సజావుగా ఉండేలా చేస్తాయి.
పాలకూర: వంద గ్రాముల ఉడికించిన పాలకూరలో 2.7 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. పాలకూరను సలాడ్స్‌లో, స్మూతీల్లో, ఇతర వంటకాల్లో భాగంగా చేర్చుకుని తరచూ తింటే శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్స్, ఆగ్జలేట్లు పూర్తిగా అందుతాయి. వీటితోపాటు ఎ, సి, కె విటమిన్లు కూడా లభిస్తాయి.
రెడ్ మీట్: ఇందులో శరీరం త్వరగా గ్రహించే హేమే ఐరన్ ఉంటుంది. రెడ్‌మీట్‌ను మితంగా రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, బి విటమిన్ కూడా అందుతాయి.
గుమ్మడి గింజలు: వంద గ్రాముల గుమ్మడి గింజల్లో 3.3 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిలో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్‌ను అందిస్తాయి. గుమ్మడి గింజలను పచ్చిగా, వేయించుకొని తినవచ్చు. సలాడ్స్‌లో కలుపుకోవచ్చు.
క్వినోవా: ఇందులో ఐరన్‌తోపాటు మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ లేని ధాన్యం. దీనిని మెయిన్ డిష్ కింద వారానికి రెండు సార్లు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
టోఫు: ఇది శాకాహారులకు అధిక పరిమాణంలో ఐరన్‌ను అందించే ఆహారం. దీనిని రకరకాల వంటకాల్లో, సూపుల్లో చేర్చుకోవచ్చు. ఇందులో అధిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. మీట్‌కు ప్రత్యామ్నాయం గా చెప్పవచ్చు. టోఫుతో రకరకాల స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు.