Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
ABN , Publish Date - Jun 29 , 2024 | 02:14 PM
ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ లను కలిగి ఉంటాయి. ఇవి మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న సాల్మన్ తలనొప్పికి సంబంధించిన వాపును తగ్గించడంలో సహకరిస్తుంది.
మైగ్రేన్ అనేది భరించలేని తలనొప్పి, నరాలను గుంజేస్తూ వచ్చే ఈ నొప్పిని కొన్ని సందర్భాల్లో మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. మందులతో తప్పితే కంట్రోల్ కానీ ఈ మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. ఒత్తిడితో కూడిన జీవన విధానం కారణంగా ఈ తలనొప్పి ఉంటుంది. చాలామంది మైగ్రేన్ నొప్పితో సతమతం అవుతూ ఉంటారు. కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా జన్యశాస్త్రం ప్రకారం హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో సరైన శ్రద్ధ లేకపోవడం కూడా మైగ్రేన్ కు కారణం కావచ్చు. ఈ నొప్పిని కంట్రోల్లో ఉంచేందుకు ఆహారాలను ఎంచుకోవలసి వస్తే, అవకాడో, గింజలు, నీరు, పచ్చి ఆకు కూరలు వంటి ఆహారాలను తీసుకోవచ్చు. ఇంకా..
మైగ్రేన్‌కు డీహైడ్రేషన్ ఒక సాధారణ ట్రిగ్గర్. మైగ్రేన్ ఉన్నవారు నిమ్మకాయ నీరు, అల్లం టీ, ఉసిరి, కలబంద రసాలను కూరగాయలతో చేసిన రసాలు హైడ్రేటడ్ గా ఉంచడంలో సహకరిస్తాయి.
గ్రీన్ కూరలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని నరాల పనితీరును చక్కగా నిర్వహిస్తాయి. ఇవి మైగ్రేన్ కు చెక్ పెట్టేందుకు మంచి ఫుడ్స్. ఇవి మెదడు నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.
Healthy Fruits : కాలంతో సంబంధం లేకుండా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే ఐదు రకాల పండ్లు..
బాదం గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వు , కాల్షియం, మెగ్నీషియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తాయి. నరాలను ఒత్తిడి నుంచి కాపాడతాయి.
డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతలో సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది. మైగ్రేన్ కారకాలను తగ్గిస్తుంది.
ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ లను కలిగి ఉంటాయి. ఇవి మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న సాల్మన్ తలనొప్పికి సంబంధించిన వాపును తగ్గించడంలో సహకరిస్తుంది.
Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అల్లం మైద్రేన్ కు సంబంధించిన వికారాన్ని తగ్గిస్తుంది.
పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో తలనొప్పి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
పుచ్చకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. అధఇకంగా పండ్లు తీసుకునే వారిలో తలనొప్పి సమస్య తగ్గుతుంది.
Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
క్వినోవాలో రైబోఫ్లావిన్ విటమిన్ బి2 ఉంటుంది. ఇది మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. మైగ్రేమ్ లక్షణాలను తగ్గించే స్థితి వీటికి ఉంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.