Health Tips : విటమిన్ బి-12 తక్కువగా ఉందని తెలిపే 8 సంకేతాలు ఇలా ఉంటాయి..!
ABN , Publish Date - Jun 01 , 2024 | 03:30 PM
శరీరంలో విటమిన్ బి12 తక్కువ స్థాయిలు ఉంటే ముందుగా కనిపించే సాధారణ సంకేతాలలో ఒకటి. విటమిన్ బి12 శరీరం అంతటా ఆక్సిజన్ తీసుకువెళ్ళే బాధ్యత వహించే ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. తగినంత ఆక్సిజన్ లేకుండా ఉంటే నిద్ర 8 గంటల పాటు ఉన్నప్పుటికీ అలసిపోతుంటారు.
విటమిన్ బి12 లోపం శరీరంలో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. క్రమంగా ఈ లక్షణాలు తీవ్రం అవుతూ ఉంటాయి. వీటితో గందరగోళానికి గురవుతాయి.
అలసట శక్తి లేకపోవడం..
శరీరంలో విటమిన్ బి12 తక్కువ స్థాయిలు ఉంటే ముందుగా కనిపించే సాధారణ సంకేతాలలో ఒకటి. విటమిన్ బి12 శరీరం అంతటా ఆక్సిజన్ తీసుకువెళ్ళే బాధ్యత వహించే ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. తగినంత ఆక్సిజన్ లేకుండా ఉంటే నిద్ర 8 గంటల పాటు ఉన్నప్పుటికీ అలసిపోతుంటారు.
చర్మం సెన్సివిటీ..
చర్మం రంగు మారుతుంది. ఇది విటమిన్ బి12 తగ్గినపుడు మాత్రమే కనిపించే లక్షణం. చర్మం పాలిపోయినట్టుగా, పసుపు రంగులోకి మారుతుంది.
చేతులు, కాళ్లలో తిమ్మిరి ఉంటుంది.
కాళ్లలో పిన్స్, సూది గుర్చినట్టుగా నొప్పి ఉంటుంది. తిమ్మిరి ఉంటుంది. కణాలలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల నరాలు దెబ్బతినడం జరుగుతుంది.
Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..
గందరగోళం, మెదడు మొద్దుబారడం, మతిమరుపు..
రోజువారి విషయాలు మరిచిపోతారు. విటమిన్ బి12 లోపం కారణంగా ఇలా జరుగుతుంది.
డిప్రెషన్..
విటమిన్ బి12 మానసిక స్థితి సరిగా లేకపోవడం, మరిచిపోవడం ఉంటుంది. ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది.
ఊపిరి ఆడనట్టుగా, తలనొప్పి కూడా ఉంటుంది.
తలనొప్పి, తల తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. తేలిక పాటి వ్యాయామంతో, మెట్లు ఎక్కడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. రక్త కణాలకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
బ్యాలెన్స్ కోల్పోవడం..
నాడీ వ్యవస్థకు నష్టం ఉంటుంది. సమతుల్యత, సమన్వయం తగ్గుతుంది. ఈ పరిస్థితి ప్రమాదాలకు గురి చేస్తుంది.
ఎర్రబడిన నాలుక, రక్తస్రావం ఉన్న చిగుళ్ళు..
విటమిన్ లోపంతో గ్లోసిటిన్, నోటి పూత ఎక్కువగా ఉంటుంది. గొంతు ఎర్రగా మారుతుంది. నొప్పి, వాపు ఉంటాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.