Glowing Skin : తియ్యని చాక్లెట్ మాస్క్.. దీనితో బోలెడు గ్లో మీ సొంతం..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:02 PM
చర్మనిగారింపుకు తియ్యని చాక్లెట్ ఫేస్ మాస్క్ మంచి మెరుపునిస్తుంది. ఇది చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.
తియ్యని చాక్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు. పిల్లలు, పెద్దలూ అంతా ఇష్టపడే చాక్లెట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి నిగారింపు వస్తుంది. మెరిసే ఛాయ కోసం రకరకాల ఉత్పత్తులను ముఖానికి పూస్తూ ఉంటాం. చర్మ సౌందర్యానికి పండ్ల ప్యాక్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే చాక్లెట్ ప్యాక్ మంచి నిగారింపుని ఇస్తుందట. ఓసారి ట్రై చేయండి.
చర్మనిగారింపుకు తియ్యని చాక్లెట్ ఫేస్ మాస్క్ మంచి మెరుపునిస్తుంది. ఇది చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే చాక్లెట్ ఛాయను పెంచడంలో ముందుంటుంది. ఇందులోని యాంటీ గుణాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహకరిస్తుంది.
డార్క్ చాక్లెట్ లో కాటెచిన్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాల్స్ హానికరమైన UVకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!
క్లాసిక్ చాక్లెట్ ఫేస్ మాస్క్..
చాక్లెట్ మాస్క్ వేసుకున్నప్పుడు ముందుగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
ఫేస్ మాస్క్ ఆరిన తర్వాత పొడిగా ఉన్నప్పుడు దానిని తీసివేయాలి. మరీ ఆరిపోయి ముఖానికి అంటుకుంటే కాసిని నీరు వేసి తీయాలి. కంటి ప్రాంతాన్ని తప్ప మిగతా ప్రాంతం అంతా వేయవచ్చు. తీసేటప్పుడు కూడా నెమ్మదిగా వృత్తాకారంలో వేళ్లను కదుపుతూ తీయాలి.
Vitamin B6 : మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..!
2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మాస్క్ వేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసిన 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలో గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ మాస్క్ చర్మాన్ని హేడ్రేట్‌గా చేస్తుంది. కోకోలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.