Share News

Hair growth: జుట్టు పెరుగుదలను పెంచే స్కాల్ప్ మసాజర్లు ఇవే.. వీటితో ఒత్తైన జుట్టు ఖాయం.. !!

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:10 PM

ఇది జుట్టు షాప్ట్ నెన్ ని పెంచుతుంది. చుండ్రు రాకుండా చేస్తుంది. ఒత్తిడి, దురద, నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు మూలలాలకు వెళ్లి మసాజ్ చేస్తుంది

Hair growth: జుట్టు పెరుగుదలను పెంచే స్కాల్ప్ మసాజర్లు ఇవే.. వీటితో ఒత్తైన జుట్టు ఖాయం.. !!
your hair

పొడవైన అందమైన జుట్టును కోరుకోని వారు ఉండరు. అయితే జుట్టు అందంగా, నిగనిగలాడుతూ కనిపించడానికి చాలా రకాల ఉత్పత్తులనే వాడుతుంటాం. పైపూతలతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల బావుంటుంది. జుట్టుకు సరైన పోషణ, హైడ్రేషన్ అందించడం అనేది ఆరోగ్యకరమైన జుట్టును పొందేలా చేస్తుంది. జుట్టు షైన్, వాల్యూమ్ మెరుగుపరచాలంటే స్కాల్ఫ్ మసాజర్ లను ఎంచుకోవడమే.. ఇవి జుట్టు ఒత్తుగా పెరిగేలా చూస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. అవేమిటంటే..

మసాజర్లు..

జుట్టు పెరుగుదలను పెంచే విధంగా ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుకు స్కాల్ఫ్ మసాజర్స్ కూడా అంతే ఉపయోగపడతాయి.

వుడెన్ హెయిర్ బ్రష్ స్కాల్ప్ మసాజర్

ఎకో-ఫ్రెండ్లీ హెయిర్ కేర్ చెక్కతో తయారుచేసిన ఈ స్కాల్ఫ్ మసాజర్ ని ఉపయోగించడం వల్ల వుడ్ సహజమైన మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది జుట్టు షాప్ట్ నెన్ ని పెంచుతుంది. చుండ్రు రాకుండా చేస్తుంది. ఒత్తిడి, దురద, నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు మూలలాలకు వెళ్లి మసాజ్ చేస్తుంది. దీనితో జుట్టు తాజాగా కనిపిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్

మాన్యువల్ స్కాల్ఫ్ మసాజర్ ఎలక్ట్రిక్ మసాజర్‌ని ఉపయోగించవచ్చు. ఇది స్కాల్ఫ్ మసాజర్ గా కండరాలకు ఉపశమనం ఇస్తుంది. ఈ లైట్ వెయిచ్ స్కాల్ఫ్ మసాజర్ క్యారీ చేయడం సులభం, స్కాల్ఫ్ రిలాక్సేషన్ అందడంతో పాటు మెడ, భుజం, వీపుకు కూడా ఇది మంచి రిలీఫ్‌ని ఇస్తుంది.

జుట్టు పెరుగుదలకు స్కాల్ప్ మసాజర్‌తో ప్రయోజనాలు..

స్కాల్ప్ మసాజర్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు. రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్‌లో ఈ టూల్‌ను వాడటం వల్ల జుట్టు ఒత్తుదనం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: మెదడు ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మ గురించి తెలుసుకుందాం..!!


1. స్కాల్ప్ మసాజర్‌లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఇది తలలో సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ తగిన మొత్తంలో పోషకాలు, ఆక్సిజన్‌ను స్వీకరించడానికి అనుమతిస్తుంది, జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

2. స్కాల్ప్‌ను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల టెన్షన్, ఒత్తిడి తగ్గుతుంది.

3. జుట్టు కుదుళ్లను విశ్రాంతి దశ నుండి పెరిగే దిశకు మార్చడాన్ని ఇది సహకరిస్తుంది.

4. స్కాల్ప్ మసాజర్‌లు సహజ స్కాల్ప్ ఆయిల్‌లను హెయిర్ షాఫ్ట్ వెంట తగినంతగా పంపిణీ చేస్తాయి. జుట్టుకు సరైన తేమను అందిస్తాయి.

5. స్కాల్ప్ మసాజర్లు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చుండ్రుని తగ్గించే విధంగా పనిచేస్తాయి.

6. జుట్టుపెరుగుదలకు, చుండ్రు నివారణకు కూడా స్కాల్ప్ మసాజర్ చక్కని ఎంపిక.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 03 , 2024 | 01:10 PM