Share News

Runny Nose : ముక్కు కారడం తగ్గడానికి ఈ ఇంటి చిట్కాలను పాటించి చూడండి..!

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:46 PM

ఎన్ని చేసినా జలుబు దానంతట అది తగ్గాలి తప్ప, మామూలుగా అంత తేలికగా పోదు. కానీ కొన్ని ఇంటి నివారణలతో., చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Runny Nose : ముక్కు కారడం తగ్గడానికి ఈ ఇంటి చిట్కాలను పాటించి చూడండి..!
runny nose

జలుబు వచ్చిందంటే ఓ పట్టాన ముక్కు కారటం వదలదు. ముక్కు నుంచి నీరు కారటం ఎంతో విసుగు, చిరాకు కలిగిస్తుంది. కాకపోతే జలుబు నుంచి ఉపశమనానికి చాలా రకాల మందుల్ని వాడేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా జలుబు దానంతట అది తగ్గాలి తప్ప, మామూలుగా అంత తేలికగా పోదు. కానీ కొన్ని ఇంటి నివారణలతో., చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేమిటంటే..

ఆవిరి పీల్చడం..

ఆవిరి పీల్చడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఇంటి చిట్కా, ఇది ముక్కు రద్దీకి ఉపశమనాన్ని అందిస్తుంది. నీటిని మరిగించి, అందులో కాస్త పసుపు, బామ్ లాంటివి వేసి, తలను గిన్నెకు దగ్గరగా ఉంచాలి, ఒక టవల్‌తో తల మీద నుంచి వేసి ఆవిరి పీల్చుకుంటూ ఉండాలి. ఇలా 5-10 నిమిషాలు లోతుగా పీల్చుకోవాలి. ఇంకా త్వరగా రిలీఫ్ రావాలంటే అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ వేస్తే సరి. ఇది డీకాంగెస్టెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి త్వరగా రిలీఫ్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 అలవాట్లు ఇవే..!


వేడి పానీయాలు ..

హెర్బల్ టీ, అల్లం, నిమ్మకాయ, తేనె ఒక క్లాసిక్ కాంబో, దీనికి పసుపు, దాల్చినచెక్కతో, వెచ్చని పాలు కలిపి ఒక కప్పు సిప్ చేయండి. ఈ వెచ్చదనం శ్లేష్మం రిలీఫ్‌కు సహాయపడుతుంది, ఈ మూలికలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, డీకాంగెస్టెంట్ లక్షణాలను అందిస్తాయి.

పుక్కిలి పట్టండి ..

ఉప్పునీటి ద్రావణంతో నోటిని శుభ్రం చేయాలి. ఇది ముక్కును లూజ్ చేస్తుంది. అలెర్జీ కారకాలను, శ్లేష్మం ఏర్పడటాన్ని తొలగిస్తుంది. ఇది ముక్కుకు మినీ స్పా ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లే. చికాకును నివారించడానికి వేడి నీటిని ఉపయోగించాలి.

హైడ్రేషన్..

ముక్కు కారుతూ ఉన్నప్పుడు, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. పుష్కలంగా నీరు తీసుకోవాలి, గోరువెచ్చని వేడి నీరు, పులుసులు, సూప్స్ తీసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల ద్రవాలను తీసుకోవాలి.

మసాలాలు..

మిరపకాయలు వంటి స్పైసీ ఫుడ్స్‌ని తీసుకోవడం సహజమైన డీకాంగెస్టెంట్‌గా పని చేస్తుంది. కాప్సైసిన్, స్పైసీ ఫుడ్స్‌లో ఉండే సమ్మేళనం, ముక్కు భాగాలను తెరచి, జలుబుని తగ్గిస్తాయి. భోజనాన్ని కారం, మసాలా సూప్‌లతో తీసుకున్నా కూడా, ముక్కు కారటం నుండి ఉపశమనం కలుగుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 18 , 2024 | 01:49 PM