Share News

Side Effects : పాలు ఎక్కువగా తాగే అలవాటుందా.. ? అయితే ఈ సమస్యలు తప్పవట.. !

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:04 PM

పాలు తరచుగా కాల్షియం, విటమిన్ డి అవసరమైన ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే ఆహారాలలో ముఖ్యమైన భాగం. పిల్లలు, వృద్ధులు అధికంగా పాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.

Side Effects : పాలు ఎక్కువగా తాగే అలవాటుందా.. ? అయితే ఈ సమస్యలు తప్పవట.. !
Milk

పాలు ప్రతి ఒక్కరికీ ఇష్టంగా తాగే పానీయాలలో ఒకటి. పిల్లలు, పెద్దలనే బేధం లేకుండా అంతా ఏదో రూపంలో పాలను తీసుకుంటూ ఉంటారు. పాల ఉత్పత్తులనూ ఇష్టపడతారు. అయితే పాలను మరీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట.. ఇలా ఎందుకంటే..

పెద్దలకు కాల్షియం గరిష్ట విలు 600 mg వద్ద ఉండాలి. దాదాపు రెండు గ్లాసుల పాలు 10కి 800 mgdl. వయసు పెరిగే కొద్దీ పాలలోని అనారోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులకు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తాయి.

నేషనల్ లైబ్రరీ ఆఫి మెడిసిన్ ప్రకారం ఒక గ్లాసు పాలలో 5 గ్రా సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి రోజూవారీ అవసరాలలో 20శాతం సంతృప్త కొవ్వులు హృదయ సంబంధ వ్యాధులకు కారణం అవుతాయి. అధిక పాలు తీసుకోవడం ఎముక పగుళ్లు, మరణాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

Health Benefits : వేసవిలో వచ్చే తాటి ముంజులతో ఎన్ని ఉపయోగాలంటే.. !

ఎక్కువ పాలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం అనీమియా, జీర్ణశయం నుండి ప్రోటీన్ నష్టం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

అధిక మొత్తంలో పాలు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇది లాక్టోస్, సంతృప్త కొవ్వు, హార్మోన్ల కారణంగా మొత్తం ఆరోగ్యం రాజీ పడుతుంది. కానీ పాలు తరచుగా కాల్షియం, విటమిన్ డి అవసరమైన ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే ఆహారాలలో ముఖ్యమైన భాగం. పిల్లలు, వృద్ధులు అధికంగా పాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి కావలసిన మోతాదు మాత్రమే తీసుకుంటూ ఉండాలి.


Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..

1. పాలలో ఉండే చక్కెర లాక్టోస్ జీర్ణం కావడం కష్టం చేస్తుంది. ఇది ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పికి కారణం కావచ్చు.

2. బరువు పెరుగుతారు. పాలలో 250 మిల్లీ 180 కేలరీలుంటాయి. పాలను ఎక్కువగా తీసుకోవడాలి. అధిక కేలరీలు కొవ్వులు సమతుల్యం కానట్లయితే బరువు పెరుగుతారు.

3. పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

4. పోషకాల అసమతుల్యతకు కారణం అయితే పాలు అధికంగా తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తగినంతగా అందవు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 03 , 2024 | 05:04 PM