Health Tips : అరటి పండు పరగడుపున తినకూడదా..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:25 PM
అరటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి బరువును పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్య ఉంటుంది.
కాస్త నీరసంగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా వెంటనే అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండు ముందుంటుంది. అరటి పండును తేలిగ్గా జీర్ణం చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకీ ఇష్టమైనది కూడా.. ఇక అరటి పండు ప్రతి సీజన్ లోనూ దొరుకుతుంది. అరటి పండు చాలా చవకగా దొరుకుతుంది. జంక్ ఫుడ్ కి బదులుగా అరటిపండ్లు తినడామే మంచిదని డాక్టర్స్ చెబుతుంటారు కూడా.. రెండు పండ్లను తింటే చాలు కడుపు నిండిపోతుంది. శరీరం తక్షణమే శక్తిని నింపుకుంటుంది. అయితే అరటి పండ్లను తినడం పై చాలా అపోహలు కూడా ఉన్నాయి. అల్పాహారంగా అరటి పండును తినడం అంత మంచిది కాదనే వాదన కూడా ఉంది. దీనిని పరగడుపునే అరటిపండ్లను తినడం వల్ల ఇబ్బందులు తప్పవా.. అదే తెలుసుకుందాం.
అరటి పండ్లును ఖాళీ కడుపుతో తినవద్దు..
నిజానికి అరటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. అలాగే గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు కడుపు నొప్పి,. వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు తగ్గాలంటే అరటిపండ్లను మిగతా ఆహారాలతో కలిపి తినాలి.
Vitamin B6 : మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..!
ఖాళీ కడుపుతో అరటిపండ్లు..
అరటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి బరువును పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్య ఉంటుంది. ఒక మీడియం అరటిపండు తింటే 25 నుండి 30 గ్రాముల కార్బోహైడ్రట్లు, 90 నుంచి 105 కేలరీలు అందుతాయి.
అరటిపండు తినడానికి..
అరటిపండు తింటే ఉత్సాహంగా ఉంటారు. ఉదయం కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అరటిపండును తినవచ్చు. ఈ సమయాల్లో తినడం వల్ల శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.