Hair Growth : జుట్టు, గోళ్లు పెరుగుదలకు బయోటిన్ ఎంత వరకూ అవసరం..!
ABN , Publish Date - May 15 , 2024 | 01:06 PM
రక్తంలో చక్కెరను సమంగా ఉంచేందుకు సహకరిస్తుంది. బయోటిన్ అధికంగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. ఇది ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఒత్తైన జుట్టు పెరగాలంటే, దానికి సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జుట్టు ఎదుగుదల ఆగిందంటే మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోడంలేదని, ఏదో అనారోగ్య సమస్య తలెత్తిందనేది గమనించుకోవాలి. జుట్టు, గోళ్లు, చర్మం నిగారింపులో ఏమార్పు కనిపించినా అది బయోటిన్ లోపంగానే తీసుకుసుకోవాలి. దీనికి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. బయోటిన్ విటమిన్ B7 లేదా విటమిన్ H అనికూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్. ఆరోగ్యకరమైన చర్మ కణాలకు అవసరమైన కొవ్వు ఆమ్లాల సంశ్లేషణలో దాని పాత్ర కారణంగా ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యం. ఇది కెరాటిన్ ఉత్పత్తికి కారణం అవుతుంది. జుట్టు, గోళ్ల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అరుదైనదిగా చెప్పబడే బయోటిన్ లోపం, పొడి, పొలుసుల చర్మం, పెళుసుగా ఉండే గోర్లు, జుట్టు రాలడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. సహజంగా తీసుకునే గుడ్లు, బాదం, గింజలు, మాంసం, చేపలు, చిలగడదుంప, బచ్చలి కూర వంటి కొన్ని కూరగాయలు బయోటిన్ రిచ్ ఫుడ్స్ ద్వారా దొరుకుతాయి.
బయోటిన్ అంటే..
శరీరంలోని అనేక జీవక్రియ కార్యకలాపాలు జరగాలంటే దానికి బయోటిన్ అవసరం. ఇది కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లను జీవక్రియ చేస్తుంది.
బయోటిన్ ప్రయోజనాలు ఏమిటి..
ఆరోగ్యకరమైన జుట్టు, చర్మానికి బయోటిన్ అవసరం. ఈ బయోటిన్ అనేది అందంతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ముఖ్యమైనది. ఇది చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా చేస్తుంది. గోళ్లను బలపరుస్తుంది.
Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..
తినే ఆహారాన్ని శక్తిగా మార్చడానికి శరీరం బయోటిన్ ని ఉపయోగిస్తుంది. పిండి పదార్థాలు, లిపిడ్లు, ప్రోటీన్ల జీర్ణక్రియలో శరీరం వాటిని శక్తి, ఇతర పనుల కోసం ఉపోయగించుకునేలా చేస్తుంది.
నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
రక్తంలో చక్కెరను సమంగా ఉంచేందుకు సహకరిస్తుంది. బయోటిన్ అధికంగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. ఇది ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
Summer Drinks : వేసవి తాపాన్ని అధిగమించడానికి వీటితో చేసే షర్భత్ తాగితే చాలు..!
గర్భధారణ సమయంలో పిండం పెరుగుదలకు బయోటిన్ అవసరం. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. శిశువు, అవయవాల పెరుగుదలకు సపోర్ట్ చేస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పెరుగుదలకు గింజలు, విత్తనాలు, చిలగడదుంపలు, గుడ్లు, సాల్మన్, పుట్టగొడుగులు, అవోకాడో, చిక్కుళ్ళు, బయోటిన్ పెద్దలకు 30-100 mg, పదేళ్ళకంటే ఎ్కకువ వయసు తక్కువ ఉంటే 30mg తీసుకోవాలి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.