Share News

Toothbrush : ఆ బ్రష్‌తో చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.. అదెలాగంటే..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:35 AM

నోటి లోపలి భాగాలకు చేరుకోవడానికి, జ్ఞాన దంతాలలో ఇరుకున్న ఆహార పదార్థాలను తొలగించడానికి వీలుగా చిన్న చిట్కా సరైన బ్రష్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

Toothbrush : ఆ బ్రష్‌తో చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.. అదెలాగంటే..!
Toothbrush

అందమైన నవ్వుకు అందానిచ్చేది అందమైన పలువరస. అయితే కొందరిలో మరీ విసిగించే సమస్య నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పి, వీటిని తగ్గించుకోవాలంటే మాత్రం మంచి బ్రషింగ్ టెక్నిక్ అలవరుచుకోవడమే. దీనికి దంతవైద్యలు సలహా మేరకు పళ్ళు తోముకునేప్పుడు మనం చేసే తప్పుల్ని గమనిస్తే చాలు. అలాగే మనం ఉపయోగించే బ్రష్‌తో పాటు చిన్న పిల్లలకు వాడే బేబీ బ్రష్‌ను( Toothbrush )కూడా వాడటం వల్ల పళ్ల మూలల్లోకి చేరి క్రిములను తొలగించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు. దీనితో నోటి దుర్వాసన సమస్య, అలాగే చిగుళ్ల నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు.

నోటి లోపలి భాగాలకు చేరుకోవడానికి, జ్ఞాన దంతాలలో ఇరుకున్న ఆహార పదార్థాలను తొలగించడానికి వీలుగా చిన్న చిట్కా సరైన బ్రష్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఈ కావిటీస్ ని తొలగించడానికి చిన్న పిల్లల కోసం తయారు చేసిన బ్రష్‌లను ఉపయోగించడం మంచి ఉపాయంగా పనిచేస్తుంది. బేబీ టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బ్రష్ బ్రిస్టల్స్ (Bristles) వంగిపోకుండా ఉండేలా మరీ నొక్కి కాకుండా సున్నితంగా బ్రష్ చేయాలి. అలాగే బ్రష్ బ్రిస్టల్స్ వంగి పోయినపుడు ఆ బ్రష్ మార్చి కొత్తది వాడటం అలవాటు చేసుకోవాలనేది దంత వైద్యులు ఇస్తున్న సలహా.

బేబీ టూత్ బ్రష్‌( baby toothbrush) తో ఉపయోగాలు..

బేబీ టూత్ బ్రష్‌లు సాధారణంగా చిన్న హెడ్‍తో ఉంటాయి. ఇవి జ్ఞాన దంతాల వరకూ వెళ్లగలవు. మోలాల్ వరకూ చేరుకుని దంతాలను శుభ్రం చేయగలవు.

ఈ బేబీ బ్రెష్ మృదువైన బ్రిస్టల్స్‌తో ఉంటాయి. ఇవి సున్నితమైన చిగుళ్ళు, నోటి లోని సున్నితమైన ప్రాంతాలపై సున్నితంగా పనిచేస్తాయి.


Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

చిన్న హ్యాండిల్ బ్రష్ చేసేప్పుడు మరీ ఒత్తిడి లేకుండా చేయాలి. దీనివల్ల జ్ఞాన దంతాలు, ఇతర ప్రదేశల చుట్టూ నావిగేట్ చేసేప్పుడు సహాయపడుతుంది.

అయితే బేబీ టూత్ బ్రష్‌ను మనం చేసే మామూలు బ్రష్‌తో పాటుగా వాడాలి. నోటి పరిశుభ్రతకు ఇటువంటి శ్రద్ధ అవసరం.

టూత్ బ్రష్ లోని బ్రిస్టల్స్ స్ట్రెయిట్ నెస్ దంతాలను శుభ్రపరచడంలో, ముఖ్యంగా ఇంటర్ డెంటల్ స్పేస్, గమ్ లైన్‌ను చేరుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 20 , 2024 | 11:36 AM