Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:18 PM
యాలకులు జీవక్రియను మెరుగుపరిచే అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి. జీర్ణకోశం సమస్యలను కూడా దూరం చేస్తాయి.
యాలకులు మంచి సువాసనకు పెట్టింది పేరు. ఏ వంటకమైనా, స్వీటైనా యాలకులు వేయగానే పదార్థానికి ఉండే తీరే మారిపోతుంది. చక్కని గుభాళించే సువాసనతోనే సగం కడుపు నిండిపోతుంది. మసాలా దినుసుగానూ, ఇటు స్వీట్లకు సువాసనను ఇచ్చే ప్రత్యేక ఫ్లేవర్ గానూ కూడా యాలకులు పేరు పొందాయి. వీటితో చేసిన టీ గురించి మరింక చెప్పక్కర్లెద్దు. అల్లంటీ, యాలకుల టీ ఏది చేసినా కూడా టీకి ప్రత్యేకమైన సువాసన వస్తుంది. యాలకులు టీతో ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చు.
టీ ప్రియులకు యాలకులతో చేసిన టీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. టీ అంటే చాలా ఇష్టం ఉండే వారికి యాలకులతో చేసిన టీ తప్పక తెలుస్తుంది. వంటగదిలో సుగంధ ద్రవ్యాలలో సులభంగా యాలకులు ఉండనే ఉంటాయి. తేలికపాటి సువాసనతో నోరూరించే టీ ని క్షణాల్లో తయారుచేయవచ్చు. యాలకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
అల్లం శరీరానికి వేడి చేస్తుంది. చల్లని రోజుల్లో యాలకుల టీ అయితే సరిగ్గా సరిపోతుంది. పొట్ట, శరీరం చల్లగా ఉంటుంది.
జీవక్రియను వేగవంతం చేస్తుంది. యాలకులు జీవక్రియను మెరుగుపరిచే అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి. జీర్ణకోశం సమస్యలను కూడా దూరం చేస్తాయి.
Jaiphal Water : జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి.
మధుమేహం ఉన్నవారు కూడా యాలకులను తీసుకోవచ్చు. ఇందులోని మాంగనీస్ డయాబెటీస్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఇందులో ఉన్నాయి.
రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. యాలకులు బీపీని కంట్రోల్ చేయగలవు.
Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !
నోటి ఆరోగ్యానికి కూడా చక్కని పరిష్కారం. ఇవి మంచి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి. స్ట్రప్టోకోకి మ్యూటాన్స్ వంటి నోటి బ్యాక్టీరియాతో పోరాడే యాంటీ బాక్టీరియల్స్ లక్షణాలు కలిగి ఉంది. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.