Share News

Health tips : రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !

ABN , Publish Date - May 27 , 2024 | 03:49 PM

పడుకునే ముందు చేసేవి, తినేవి డయాబెటిక్ పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సరైన జీవన విధానం కూడా చాలా అవసరం. ఏ బెడ్ టైమ్ రొటీన్ ని అనుసరించాలనే దాని గురించి అయోమయంలో పడుతుంటారు.

Health tips : రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !
Diabetes Tips

మధుమేహం ఇప్పటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. కంట్రోల్ చేయకపోతే మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగా ఉండకపోవడం, సగం రాత్రిలో నిద్రమేల్కొవడం, నిద్రపట్టినా కూడా మెలకువలో ఉన్నట్టుగానే ఉండటం వంటి లక్షణాలుంటాయి. అయితే షుగర్ ఉన్నవారు నిద్రలేకపోవడం కారణంగా చాలా చికాకుగా ఉంటూ ఉంటారు. దీనికి తోడు రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతూ పోతాయి దీనిని కంట్రోల్లో ఉంచాలంటే ఏం చేయాలో చూద్దాం.

పడుకునే ముందు చేసేవి, తినేవి డయాబెటిక్ పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సరైన జీవన విధానం కూడా చాలా అవసరం. ఏ బెడ్ టైమ్ రొటీన్ ని అనుసరించాలనే దాని గురించి అయోమయంలో పడుతుంటారు. డయాబెటిక్ అయితే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి పోషకాహార నిపుణుల సలహా అవసరం.

నిద్రవేళ సరిగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి.

చమోమిలే టీ..

మధుమేహం ఉన్నవారు పడుకునే ముందు కప్పు చమోమిలే టీ తీసుకోవచ్చు. ఇందులో యాంటీఇన్ల్ఫమేటరీ, ఆస్ట్రింజెంట్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

నానిన బాదం..

రాత్రి పూట నానబెట్టిన బాదం తీనండవల్ల ఇందులోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ చక్కని నిద్రను ఇస్తాయి. రాత్రిపూట ఆకలిని తట్టుకునేలా చేస్తుంది.


Super Foods : కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..

నానబెట్టిన మెంతులు..

మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వజ్రాసన భంగిమలో కూర్చుంటే..

వజ్రాసనంలో కూర్చున్నా కూడా ఇది బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ తగ్గడానికి సహకరిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 27 , 2024 | 03:49 PM