Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:01 PM
కాలం మారి వాతావరణం కాస్త చెమ్మగా ఉన్నా అంటువ్యాధులు చుట్టు ముడతాయి. తరచుగా జ్వరం, జలుబు, కడుపు నొప్పి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ సీజన్లో దగ్గు,జలుబు, జ్వరమే కాకుండా ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
వానలు పడుతున్నాయంటే ఒకటే కంగారుగా ఉంటుంది. పరిసరాల్లో దోమలు పెరిగిపోతాయని, ఇంటి చుట్టూ వాతావరణం చీదరగా తయారవుతుందని, దుస్తులు అంత త్వరాగా ఆరవని తెగ కంగారు పడతాం. నిజానికి వాతావరణంలో తేమ కారణంగా అస్సలు కుదురుగా అనిపించదు. చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక వానాకాలమే పెరిగే రోగాల సంగతి కూడా కాస్త చెప్పుకోవాల్సిందే.
వానాకాలమే ఎందుకు ఇలా అంటే వానాకాలం తేమ కారణంగా గాలిలో కాలుష్యం, ఇంట్లో పేరుకునే మలినాలు, బ్యాక్టీరియా కారణంగా తరచుగా పిల్లలు, పెద్దలు వ్యాధుల బారిన పడతారు. దీనికి పరిశుభ్రతే మందు. చాలా శుభ్రంగా ఉన్నాం మాకేమిటని అనుకుంటాం కానీ ఎక్కడో చిన్న చిన్న తప్పుల కారణంగా అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. అసలు మనం పెద్దగా పట్టించుకోని విషయాలు ఏమిటో చూద్దాం.
కాలం మారి వాతావరణం కాస్త చెమ్మగా ఉన్నా అంటువ్యాధులు చుట్టు ముడతాయి. తరచుగా జ్వరం, జలుబు, కడుపు నొప్పి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ సీజన్లో దగ్గు,జలుబు, జ్వరమే కాకుండా ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. దోమలు, మురికి కాల్వల పై మసిలే కీటకాల ద్వారా కూడా చాలా రకాల బ్యాక్టీరియాలు ఇంట్లో వరకూ వస్తాయి.
Super Food : ఎర్ర రైస్ చేసే మేలు ఏమిటి.. దీనిని తీసుకుంటే..
ఇక మనం తీసుకునే ఆహారం సంగతికే వస్తే మొక్క నాటిన దగ్గరి నుంచి పెరిగి కాపు కాసే వరకూ అన్ని దశల్లోనూ సొకే కీటకాలు, చీడ పీడలకు క్రిమిసంహారక మందులు నెమ్మదిగా కడుపులోకి చేరుతూనే ఉంటాయి. వీటితోనే మనం సగానికి పైగా ప్రమాదంలో పడేది. కూరగాయల పైన అంటుకున్న పురుగుల మందులు, క్రిమిసంహారకాలను వంట చేసే ముందు కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు కాస్త ఉప్పు వేసి ఎక్కువసేపు కడుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మురికి, వాటికి ఉన్నక్రిములు త్వరాగా పోతాయి.
బ్యాక్టీరియా లేదా మురికి పోవాలంటే వెనిగర్ కూడా చక్కని మార్గం. కూరగాయలను నీటిలో వేసి ఓ అరగంట ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. అలాగే వెనిగర్ నీటితో పాటు వంట సోడా నీటితో కూడా కూరగాయలను శుభ్రంగా కడగవచ్చు. కూరగాయను ఫ్రిజ్లో ఉంచే ముందు పాలిథిన్ కవర్స్ కన్నా కంటైనర్స్ నయం. వాటిలో పదార్థాలు చెడిపోవు. వర్షాకాలంలో బచ్చలికూర, కొత్తిమీరలలో బ్యాక్టీరియా పేరుకుంటుంది. వీటిని కాస్త ఎక్కువ క్లీన్ చేయడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.